Thursday, May 2, 2024
- Advertisement -

న్యూజిలాండ్‌తో మూడు వ‌న్డేలు ఆడ‌నున్న భార‌త జ‌ట్టు…

- Advertisement -

ఇటీవ‌ల జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి మంచి హుషారుగా ఉన్న టీమిండియా ఇక న్యూజిలాండ్‌తో ఆడేందుకు సిద్ధ‌మైంది. మూడు వన్డేల సిరీస్‌లో తలపడే భారత జట్టుని సెలక్టర్లు శనివారం ప్రకటించారు. ఈ నెల 22 నుంచి ప్రారంభ‌మయ్యే వ‌న్డే మ్యాచుల్లో ఆడ‌నున్న‌ టీమిండియా ఆట‌గాళ్ల పేర్ల‌ను ఈ రోజు బీసీసీఐ వెల్ల‌డించింది.

ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్‌లో విఫలమైన ఫాస్ట్ బౌలర్లు ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలపై వేటుపడగా.. యువ బౌలర్ శార్ధూల్ ఠాకూర్‌కి అవకాశం కల్పించారు. గాయం నుంచి కోలుకుని శ్రీలంకతో సిరీస్‌లో పునరాగమనం చేసిన కేఎల్ రాహుల్ ఫామ్ అందుకోలేకపోవడంతో అతడ్ని జట్టు నుంచి తప్పించి దినేశ్ కార్తీక్‌కి సెలక్టర్లు మరోసారి వన్డేల్లో ఛాన్సిచ్చారు.

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ నుంచి తన భార్యకి ఆనారోగ్యంగా ఉండటంతో ప్రత్యేక అభ్యర్థనతో తప్పుకున్న శిఖర్ ధావన్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగాడు. అయితే.. సీనియర్ క్రికెటర్లు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, అశ్విన్, జడేజాలతో పాటు యువ క్రికెటర్ రిషబ్ పంత్‌కి కూడా మరోసారి సెలక్టర్లు మొండిచేయి చూపారు.ఈ నెల 22న మొదటి వన్డే, 25న రెండో వన్డే, 29న మూడో వన్డే ఆడనుంది.

టీమిండియా జ‌ట్టు : విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్ శ‌ర్మ‌, శిఖ‌ర్ ధావ‌న్‌, అజింక్యా ర‌హానె, మ‌నీశ్ పాండే, కేదార్ జాద‌వ్‌, దినేశ్ కార్తీక్‌, ఎమ్మెస్ ధోనీ, హార్దిక్ పాండ్యా, ఆక్స‌ర్ ప‌టేల్‌, కుల్దీప్ యాద‌వ్, చాహెల్, బుమ్రా, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, శార్దుల్ ఠాకూర్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -