Tuesday, April 30, 2024
- Advertisement -

ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు వెల్లే ఆస్ట్రేలియాకు కొత్త కెప్టెన్ వ‌చ్చాడోచ్‌…

- Advertisement -

బాల్ ట్యాంప‌రింగ్ వివాదం క్రికెట్ ఆస్ట్రేలియాను ఓ కుదుపు కుదుపేసిన సంగ‌తి తెలిసిందే. వివాదంతో అత‌లాకుత‌లం అయిన ఆస్ట్రేలియా జట్టు నిదానంగా కుదరుకుంటోంది. బాల్‌ టాంపరింగ్‌ ఉదంతంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా స్టీవ్‌ స్మిత్‌పై ఏడాదిపాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ జట్టు కెప్టెన్‌ను కోల్పోయినట్లయింది.

టాంపరింగ్ వివాదానంతరం జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన టిమ్ ఫైన్‌నే జట్టు కెప్టెన్‌గా నిర్దేశించింది. త్వరలో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్ పర్యటన చేయనుంది. ఈ క్రమంలో ఈ పర్యటనలో వన్డే సిరీస్‌కు ఆసీస్‌ సారథిగా టిమ్‌ పైన్‌ను ఎంపికచేసినట్లు ఆస్ట్రేలియా కొత్త కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ మంగళవారం పేర్కొన్నారు.

టిమ్‌ పైన్‌.. బాల్‌ టాంపరింగ్ ఉదంతం అనంతరం దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు‌కు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం విదితమే. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత ఆస్ట్రేలియా జూన్‌లో ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. దీంతో ఇంగ్లాండ్‌తో వన్డే జట్టుకు కెప్టెన్‌గా పైన్‌ను, వైస్‌ కెప్టెన్‌గా అరోన్‌ ఫించ్‌ను ఎంపిక చేసినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా సెలక్టర్స్‌ ఛైర్మన్‌ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -