Thursday, May 2, 2024
- Advertisement -

కివీస్ దెబ్బ‌కు ఇంగ్లాండ్ కుదేలు….

- Advertisement -

ఇంగ్లండ్‌తో ప్రారంభమైన డే–నైట్‌ టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ సంచలనం నమోదు చేసింది. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న కివీస్‌.. ఇంగ్లీషు టీమ్‌ను అత్యల్ప స్కోరుకే కుప్పకూల్చింది. న్యూజిలాండ్‌ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ట్రెంట్‌ బోల్ట్‌, టిమ్‌ సౌతి.. ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించారు.

ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్.. కివీస్‌తో గురువారం ఆక్లాండ్‌లో తొలి టెస్టును ఆరంభించింది. ఇది న్యూజిలాండ్‌లో తొలి డే అండ్ నైట్ టెస్ట్ కావడం విశేషం. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఆట ఐదో ఓవర్ నుంచి ఇంగ్లండ్ పతనం మొదలైంది. ఇంగ్లండ్ 6 పరుగుల వద్ద ఓపెనర్ అలెస్టర్ కుక్(5) వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి కుక్ వెనుదిరిగాడు.

ఇక అక్కడి నుంచి బౌల్ట్, సౌథీ వరపెట్టి వికెట్లు పడగొట్టారు. పింక్ బంతితో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించారు. దీంతో 27 పరుగులకే ఇంగ్లండ్ 9 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్‌కు టెస్టుల్లో ఇదే అత్యంత చెత్త ప్రదర్శన అవుతుందని అంతా అనుకున్నారు. కానీ టెయిలెండర్ ఓవర్టన్ (33 నాటౌట్) పోరాడాడు. అత్యంత చెత్త రికార్డు నుంచి ఇంగ్లండ్‌ను గట్టెక్కించాడు. ఓవర్టన్ పోరాటంతో ఇంగ్లండ్ పదో వికెట్‌కు 31 పరుగులు జతచేయగలిగింది. దీంతో ఇంగ్లండ్ 58 పరుగులకు పరిమితమైంది. ఇంగ్లండ్‌కు టెస్టుల్లో ఇది ఆరో అత్యల్ప స్కోరు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఐదుగురు డకౌట్ కావడం గమనార్హం

పదునైన బంతులతో వీరిద్దరూ చెలరేగడంతో 20.4 ఓవర్లలో 58 పరుగులకే ఇంగ్లండ్‌ ఆలౌటైంది. ఇంగ్లండ్‌కు ఇది ఓవరాల్‌గా ఆరో అతిస్వల్ప స్కోరు కావడం గమనార్హం. ఐదుగురు బ్యాట్స్‌మెన్‌ పరుగులేమీ చేయకుండానే అవుటయ్యారు. జో రూట్‌, బెయిర్‌స్టో, స్టోక్స్‌, మహ్మద్‌ అలీ, స్టువర్ట్‌ బ్రాడ్‌ డకౌటయ్యారు. ఓవర్టన్‌ (33), స్టోన్‌మన్‌(11) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు.

బోల్ట్‌ 32 పరుగులిచ్చి 6 వికెట్లు నేలకూల్చాడు. సౌతి 25 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరూ మూడేసి మేడిన్‌ ఓవర్లు వేయడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -