Tuesday, May 7, 2024
- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్ స‌మ‌రంలో టీ మిండియాకు మొద‌టి ప‌రీక్ష‌…

- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభం అయినా భార‌త అభిమానుల్లో ఉత్సాహం లేదు. ఎందుకంటె ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్ ఒక్క‌మ్యాచ్‌ను కూడా ఆడ‌క‌పోవ‌డ‌మే. అభిమానుల్లో ఈ నిరాసక్తతను పోగొడుతూ టీమిండియా వచ్చేస్తోంది. భారత అభిమానులకు అసలు సిసలు ప్రపంచ కప్ నేటి నుంచి మొదలవుతోంది. సౌతంప్టన్ వేదికగా జరుగనున్న ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ లో నేడు టీమిండియా, సౌతాఫ్రికాలు తలపడనున్నాయి. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆధ్వర్యంలో ఈ మెగా టోర్నీలో తొలి మ్యాచ్ కు టీమిండియా సర్వసన్నద్ధమైంది.

ప్రపంచ కప్ ఫేవరెట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగుతోన్న భారత్ మరోసారి కప్పు కొట్టాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. 2011 మ‌రో సారి రిపీట్ కావాల‌ని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో ఎలాగైనా ఈ సారి కప్ నెగ్గేందుకు టీమిండియా సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధంగా ఉంది. ముఖ్యంగా తొలి మ్యాచ్ లో సౌతాఫ్రికాపై విజయం సాధించడం ద్వారా బోణీ కొట్టాలని ఊవిళ్లూరుతున్న కోహ్లీ సేన, ప్రస్తుతం అన్ని విభాగాల్లోనూ ఫిట్ గా కనిపిస్తోంది.

ఇద‌లా ఉంటె స‌ఫారీల‌ను మాత్రం గాయాలు వెంటాడుతున్నాయి. సౌతాఫ్రికాకు చెందిన కీలక ఆటగాళ్లైన డేల్ స్టెయిన్, ఎన్ గిడి గాయాల కారణంగా ఈ మ్యాచ్ లో అందుబాటులో లేకపోవడం టీమిండియాకు కలిసొచ్చే అంశమే. అలాగే బంగ్లాదేశ్ చేతిలో పరాజయం పొందడం కూడా సౌతాఫ్రికాను మానసికంగా కుంగదీసే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక భార‌త్ విష‌యానికి వ‌స్తె ఓపెన‌ర్లు రోహిత్‌, ధావ‌న్‌లు ఫామ్‌లోనె ఉన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన వార్మ‌ప్ మ్యాచ్‌ల్లో ఇద్ద‌రూ పేవ‌ల ఆట‌తీరును క‌న‌బ‌ర్చ‌డంతో కొంత ఆందోళ‌న నెల‌కొంది. కెప్టెన్ కోహ్లీ ఫామ్ లోనే ఉన్నప్పటికీ నాలుగో నెంబర్‌లో కెఎల్. రాహుల్ దిగే అవకాశం ఉంది. ఐదో స్థానంలో ధోనీ ఫామ్ లో ఉండటం కలిసి వచ్చే అంశమే.

ఇక బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్, బుమ్రా బౌలింగ్ ప్రధాన ఆయుధంగా మారనుంది. అలాగే స్పిన్నర్స్ లో చాహాల్, కుల్దీప్ యాదవ్ లు అందుబాటులో ఉన్నారు. ఇక తన ఆల్ రౌండింగ్ ప్రతిభతో రాణించేందుకు హార్దిక్ పాండ్యా సిద్ధంగా ఉండటం కలిసివచ్చే అంశమే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -