Monday, April 29, 2024
- Advertisement -

భార‌త జ‌ట్టు ఎంపిక‌నేడే…ఉండేదెవ‌రు….?

- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్ మ‌హాసంగ్రామానికి అన్ని దేశాల క్రికెట్ జ‌ట్లు సిద్ద‌మ‌వుతున్నాయి. జ‌ట్ట కూర్పుపై క‌స‌ర‌త్తులు చేస్తున్నాయి. ఇక ప్ర‌పంచ క‌ప్‌లో పాల్గొనె భార‌త జ‌ట్టును ఇవాల ప్ర‌క‌టించ‌నున్నారు. జట్టును ప్రకటించేందుకు ఈ నెల 23 వరకు టైం ఉంది. బీసీసీఐ మాత్రం 8 రోజుల ముందే చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ ద్వారా జట్టును ప్రకటించబోతోంది.

గత రెండేళ్లుగా వన్డేల్లో భారత జట్టు ప్రదర్శన చూస్తే 11 మంది సభ్యుల విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. ఓపెనర్లుగా రోహిత్ , ధవన్ ఓకే అయినా.. రిజర్వ్ ఓపెనర్‌గా ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తికరం. రాహుల్‌కు చాన్సిస్తారా లేక అతడిని నాలుగో నంబర్ కోసం ఎంపిక చేస్తారా చూడాలి. మూడో స్థానంలో కెప్టెన్ కోహ్లీ ఉంటే.. నాలుగో నంబర్‌పై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది.

జట్టులో నాలుగో స్థానం, మూడో ఓపెనర్, రెండో వికెట్ కీపర్, నాలుగో సీమర్‌పై ఎక్కువగా దృష్టి సారించారు. ముఖ్యంగా నాలుగో స్థానంలో ఎవరిని దింపాలనే అంశంపై చాలా కాలం నిర్ణయం తీసుకోలేకపోయారు. ఇవాళ జట్టును ప్రకటించడం ద్వారా ఎవరు ఏ స్థానమో తెలిసే అవకాశం ఉంది.

ఫామ్, ఇంగ్లండ్‌ పరిస్థితులుకెప్టెన్‌ కోహ్లి ఆలోచనలను బట్టి చూస్తే తొలి 11 మంది ఆటగాళ్లు మరో మాటకు తావు లేకుండా ఎంపికవుతారు. వీరిలో కెప్టెన్‌ కోహ్లితోపాటు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్, ధోని, కేదార్‌ జాదవ్, హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్, చహల్, బుమ్రా, భువనేశ్వర్, మొహమ్మద్‌ షమీ ఖాయం. వీరిలో ఆరుగురు 2015 ప్రపంచకప్‌లో పాల్గొన్నారు.

గత ప్రపంచకప్ నుంచి నాలుగో స్థానం వేధిస్తూ వస్తున్న ఈ సమస్య ఇప్పటికీ తీరలేదు. పది మందికి పైగా ప్రయత్నించినా.. వారెవరూ ఆకట్టుకోలేకపోయారు.గతేడాది నవంబర్ వరకు నాలుగో నంబర్ రేస్‌లో ముందున్న అంబటి రాయుడు.. కెప్టెన్, కోచ్ విశ్వాసాన్ని చూరగొని కొద్దిలో కొద్ది నయం అనిపించాడు. అయితే, ఆసీస్‌తో సిరీస్‌లో పేలవంగా ఆడి మళ్లీ కొత్త చిక్కులు తెచ్చిపెట్టాడు. అతడిపైనే నమ్మకముంచుతారా లేక.. ఇటీవల బ్యాట్‌తో విలువైన ఇన్నింగ్స్‌లు ఆడిన విజయ్ శంకర్‌కు ఆ అవకాశమిస్తారా అన్న‌ది తేలాల్సిఉంది.

త‌ర్వాతి స్థానాల్లో జాద‌వ్‌, ధోని ప‌క్కా. రిజర్వ్ కీపర్‌గా పాతకాపు కార్తీక్ వైపు మొగ్గుచూపుతారా, యంగ్ తరంగ్ పంత్‌కు ఓటేస్తారో చూడాలి. ఒకటి నుంచి ఏడో స్థానం వరకు ఎక్కడైనా ఆడగలగడంతో పాటు లెఫ్ట్ హ్యాండర్ కావడం పంత్‌కు అదనపు బలం.

ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా చోటు దక్కించుకోవడం ఖాయమే. మణికట్టు ద్వయం చాహల్, కుల్దీప్ యాదవ్ ఓకే. పేస్ విభాగంలో యార్కర్ కింగ్ బుమ్రా, భువనేశ్వర్‌తో పాటు మహమ్మద్ షమీ స్థానాలు ఖరారనట్లే. ఇంగ్లాండు ఫ్లైట్ ఎవ‌రు ఎక్కుతారో కొద్ది సేప‌ట్లో తేలిపోనుంది.

జ‌ట్టు అంచ‌నా…

కోహ్లీ (కెప్టెన్), రోహిత్ (వైస్ కెప్టెన్), ధవన్, ధోనీ (వికెట్ కీపర్), జాదవ్, హార్దిక్ పాండ్యా, శంకర్, కుల్దీప్, చాహల్, బుమ్రా, భువనేశ్వర్, షమీ, జడేజా (15వ ఆటగాడు, ఐచ్ఛికం), కార్తీక్/పంత్ (అదనపు వికెట్ కీపర్), రాహుల్/రాయుడు (స్పెషలిస్ట్ ఓపెనర్/నాలుగో స్థానం), ఉమేశ్/ఖలీల్/ఇషాంత్/సైనీ (అదనపు పేసర్)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -