Thursday, May 2, 2024
- Advertisement -

వ‌ర‌ణుడి దెబ్బ‌తో వ‌ణికిపోతున్న కీవీస్‌….

- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్ స‌మ‌రంమీద కంటె ఇప్పుడు అంద‌రి చూపు వ‌ర‌ణుడిపైనె ఉంది. ఇవాలా భార‌త్‌, న్యూజిలాండ్ మ‌ధ్య తొలి సెమీఫైన‌ల్ పోరు జ‌ర‌గ‌నుంది. ఈ పోరుకు వ‌ర‌ణుడి ముప్పు ఉంద‌ని అక్క‌డి అధికారులు వెల్ల‌డించారు. మాంచెస్టర్ స్టేడియం పరిసరాల్లో సోమవారం చిరుజల్లు కురవగా.. ఈరోజు కూడా వర్షం పడే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. వ‌ర్షం ప‌డ‌టం వల్ల ఇండియాకు న‌ష్టం కంటె లాభ‌మే ఎక్కువ‌గా ఉంది. అదే న్యూజిలాండ్‌కు మాత్రం భారీ న‌ష్టం త‌ప్ప‌దు. దీంతో న్యూజిలాండ్ వ‌ర‌ణున్ని చూసి వ‌నికిపోతోంది.

లీగ్ ద‌శ‌లో బాగా రాణించి.. సెమీస్ లో చేతుతెల్తేయడం ఆ జట్టుకు పరిపాటిగా మారగా.. అందని ద్రాక్షలా ఉన్న కప్‌ను ఈ సారైనా కొట్టుకుపోవాలనే పట్టుదలతో ఉంది. కాని ఈ సారి కూడా ఆజ‌ట్టుకు వ‌ర‌ణుడు అడ్డుప‌డ‌నున్నారు. టోర్నీ లీగ్ దశలో ఇప్పటికే 7 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దవగా.. వాటికి రిజర్వ్‌డే లేకపోవడంతో టీమ్స్‌ పాయింట్లను పంచుకోవాల్సి వచ్చింది. కానీ.. సెమీస్, ఫైనల్‌కి రిజర్వ్ డే ఉన్నాయి.

మ్యాచ్ ప్రారంభమై మధ్యలో ఆగితే.. మరుసటి రోజు మ్యాచ్‌ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే మొదలు పెడతారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ రోజున కూడా వర్షం వచ్చేందుకు 60 శాతం అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో కివీస్ జట్టు వరుణుడిని వేడుకుంటుంది. ఎందుకంటే? రెండు రోజులు వర్షం కురిసి మ్యాచ్‌ ఫలితం తేలకుంటే భారత్‌ను విజేతగా ప్రకటిస్తారు. లీగ్‌ దశలో 8 మ్యాచుల్లో ఏడు గెలిచి 15 పాయింట్లతో టాప్ స్పాట్‌లో ఉంది కోహ్లీ సేన.. కానీ, 11 పాయింట్లతో కివీస్ జట్టు నాల్గో స్థానంలో ఉంది. మ్యాచ్ ఫలితం తేలాలంటే కనీసం 20 ఓవర్ల ఆట జరగాలి. ఈరోజు, బుధవారం రెండు రోజులూ కనీసం 20 ఓవర్ల ఆట సాధ్యంకాని పక్షంలో లీగ్ దశలో ఎక్కువ పాయింట్లు సాధించిన టీమిండియా ఫైనల్‌కి చేరనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -