Monday, April 29, 2024
- Advertisement -

విండీస్ తో మ్యాచ్ లో సెంచరీతో కేక పుట్టించిన కోహ్లీ….భారత్ ఘనవిజయం

- Advertisement -

వెస్టిండీస్‌తో క్వీన్స్‌పార్క్‌ ఓవల్‌ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఘనవిజయం సాధించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీతో (125 బంతుల్లో 120; 14 ఫోర్లు, 1 సిక్సర్) కదం తొక్కడంతో విండీస్ పై భారత్ 59 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలువడంతో పాటు.. విండీస్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు పుస్తకాల్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 279 పరుగులు చేసింది. ఇక శ్రేయస్ అయ్యర్ (68 బంతుల్లో 71; 5 ఫోర్లు, 1 సిక్సర్) హాఫ్ సెంచరీ చేశాడు. టాపార్డర్ విఫలమైన చోట వీరిద్దరు చక్కటి సమన్వయంతో ఆడటంతో విరాట్ సేన ప్రత్యర్థి ముందు మంచి లక్ష్యాన్ని ఉంచగలిగింది.

వర్షం కారణంగా మ్యాచ్‌ను 46 ఓవర్లకు కుదించి విండీస్‌ లక్ష్యాన్ని 270 పరుగులుగా నిర్దేశించారు. భారత బౌలర్ల ధాటికి వెస్టిండీస్‌ పోరాటం 42 ఓవర్లలో 210 పరుగుల వద్దే ముగిసింది. ఓపెనర్‌ లూయిస్‌ (65; 80బంతుల్లో 8×4, 1×6), పూరన్‌ (42; 52బంతుల్లో 4×4, 1×6) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. భారత బౌలరల్లో షమి(2/39), కుల్దీప్‌(2/59) ఆకట్టుకున్నారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్‌ 1-0తో బోణీ కొట్టింది.

మ్యాచ్‌లో ఓపెనర్లు శిఖర్ ధావన్ (2: 3 బంతుల్లో), రోహిత్ శర్మ (18: 34 బంతుల్లో 2×4)‌తో పాటు రిషబ్ పంత్ (20: 35 బంతుల్లో 2×4) ఫెయిలైనా.. మొక్కవోని దీక్షతో బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ తడపడకుండా సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్రపోషించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -