Wednesday, May 8, 2024
- Advertisement -

28 సంవ‌త్స‌రాల త‌ర్వాత మూడోసారి స్పిన్‌లేకుండా బ‌రిలోకి దిగిన భార‌త్‌..

- Advertisement -

దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మూడో టెస్టులో టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రెండు టెస్టుల్లోనూ టాస్ గెలిచిన డుప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. టెస్ట్ సిరీస్‌ను కోల్పోవ‌డంతో కోహ్లీపై అన్ని వార్గాల‌నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి తెల‌సిందే.

విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో చివరి టెస్టులో ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా కోహ్లి వ్యవహరించాడు. రోహిత్ శర్మను తప్పించి విదేశాల్లో మెరుగైన రికార్డు ఉన్న రహానేకు తుది జట్టులో చోటు కల్పించాడు. అశ్విన్ స్థానంలో భువనేశ్వర్ కుమార్‌కు అవకాశం ఇచ్చారు. దక్షిణాఫ్రికా కూడా స్పిన్నర్ లేకుండానే బరిలో దిగింది.

ఈ మ్యాచ్‌లో ఒక్క స్పిన్నర్ కూడా లేకుండానే టీమిండియా బరిలో దిగడం ఇది మూడోసారి కావడం గమనార్హం. 1992లో సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ నలుగురు పేసర్లతోనే ఆడింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా తరఫున శ్రీనాథ్, బెనర్జీ, కపిల్, ప్రభాకర్ బరిలో దిగాడు. 2012లో వాకాలో జరిగిన మ్యాచ్‌లోనూ భారత్ పేస్‌బౌలింగ్‌నే నమ్ముకుంది. ఇషాంత్ శర్మ, జహీర్, ఉమేశ్, వినయ్‌ కుమార్‌లు ఆ టెస్టులో బౌలింగ్ చేశారు. ఇప్పుడు స‌ఫారీతో మూడోటెస్ట్‌లో స్పిన్ లేకుండా బ‌రిలోకి దిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -