Monday, April 29, 2024
- Advertisement -

గ‌బ్బ‌ర్ వికెట్ కోల్పోయిన టీమిండియా…

- Advertisement -

హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో ఆసిస్‌ను భార‌త బౌల‌ర్లు 236 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్ 50 ఓవ‌ర్ల‌కు 7 వికెట్లు కోల్పోయి 236 ప‌రుగులు చేసింది. స్కోరు బోర్డుపై పరుగులేమీ చేరకుండానే ఫించ్ ను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. రెండో వికెట్ కు ఖవాజా (50), స్టోయినిస్ లు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జాధవ్ బౌలింగ్ లో స్టోయినిస్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఆసీస్ వికెట్లు క్రమం తప్పకుండా పడిపోయాయి. హ్యాండ్స్ కోంబ్ 19, మ్యాక్స్ వెల్ 40, టర్నర్ 21, కౌల్టర్ నైల్ 28 పరుగులు చేశారు. క్యారీ 36, కమిన్స్ 0 నాటౌట్ గా నిలిచారు.

236 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్‌కు ఆదిలోనె ఎదురు దెబ్బ త‌గిలింది. కౌల్టర్ నైల్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతినే శిఖ‌ర్‌ ధావన్ పాయింట్ దిశగా డ్రైవ్ చేశాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మాక్స్‌వెల్ అలవోకగా క్యాచ్ అందుకోవడంతో ధావన్ డకౌట్‌గా నిష్క్రమించాడు. ప్ర‌స్తుతం క్రీజ్‌లో రోహిత్ 24 పుగులు, కోహ్లీ 22 ప‌రుగుల‌తో ఉన్నారు.ప్ర‌స్తుతం ఇండియా స్కోరు 12 ఓవ‌ర్లుకు 49 తో ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -