Tuesday, April 30, 2024
- Advertisement -

మ్యాచ్ ఓడినా ఎవరికీ సాధ్యం కాని రికార్డును సాధించిన‌ కోహ్లీ …

- Advertisement -

భారత్-ఆస్ట్రేలియాల మధ్య వైజాగ్ వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో చివరి బంతికి ఆసీస్‌ను విజయం వరించింది. టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 126 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. 127 ప‌రుగుల ల‌క్ష్యతో బ‌రిలోకి దిగిన ఆసిస్‌ను భార‌త్ చివ‌రి వ‌ర‌కు క‌ట్ట‌డి చేసేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నించింది. ఉత్కంఠ భ‌రితంగా సాగిన మ్యాచ్‌లో చివ‌ర‌కు ఆసిస్‌ను విజ‌యం వ‌రించింది. మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ(14) పరుగులకే అవుట్ అయి వెనుదిరగడంతో 14గా ఉన్న భారత స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు కెప్టెన్ కోహ్లీ. బ్యాటింగ్‌కు దిగి 17 బంతుల్లోనే 24 పరుగులు చేశాడు. మ్యాచ్ ఓడినా విరాట్ కోహ్లీ మాత్రం టీ20ల్లో ఎవ‌రికీ సాధ్యం కానిఅరుదైన రికార్డును సాధించాడు.

24 ప‌రుగులు చేసిన కోహ్లీ ఆస్ట్రేలియాపై టీ20ల్లో కోహ్లి స్కోరు 512 పరుగులకు చేరింది. ఆసీస్‌తో ఇప్పటివరకు 15 టీ20లు ఆడిన కోహ్లి ఐదు హాఫ్ సెంచరీలు సహా 56.88 సగటుతో 512 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు టీ20 క్రికెట్ చరిత్రలో ఓ టీమ్‌పై ఓ బ్యాట్స్‌మన్ 500కుపైగా పరుగులు చేయడం ఇదే మొద‌టిసారి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -