Monday, April 29, 2024
- Advertisement -

మెల్‌బోర్న్ టెస్ట్‌…443 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్

- Advertisement -

ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మూడ‌వ టెస్టులో.. భార‌త్ తన మొద‌టి ఇన్నింగ్స్‌ను ఏడు వికెట్ల‌కు 443 ప‌రుగుల వ‌ద్ద డిక్లేర్ చేసింది. రోహిత్ 63 ర‌న్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. నేడు కనీసం 10 ఓవర్ల పాటు ఆసీస్ ను బ్యాటింగ్ చేయించాలన్న ఉద్దేశంతోనే ఇండియా ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసినట్టు తెలుస్తోంది. స్టార్క్ బౌలింగ్‌లో ర‌వీంద్ర‌ జ‌డేజా ఔట్ కాగానే.. కోహ్లీ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు.

భారత ఇన్నింగ్స్ లో హనుమ విహారి 8, మయాంక్ అగర్వాల్ 76, పుజారా 106, కోహ్లీ 82, రహానే 34, రిషబ్ పంత్ 39, రవీంద్ర జడేజా 4 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 63 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు.ఇండియ‌న్ ఇన్నింగ్స్‌లో చ‌తేశ్వ‌ర్ పుజారా అత్య‌ధికంగా 106 ర‌న్స్ చేశాడు. కెప్టెన్ కోహ్లీ 82 ర‌న్స్ చేశాడు. ఆసీస్ బౌల‌ర్లు ప్యాట్ క‌మ్మిన్స్ మూడు, స్టార్క్ రెండు వికెట్లు తీసుకున్నారు.

రెండ‌వ టెస్టులో స్థానం కోల్పోయిన రోహిత్‌.. మూడ‌వ టెస్టులో మాత్రం త‌న ఆట‌తీరుతో ఆక‌ట్టుకున్నారు. ఆసీస్ ప్లేయ‌ర్లు మాట‌ల‌తో రెచ్చ‌గొట్టినా.. కూల్‌గా బౌండ‌రీల‌తో భారీ స్కోర్ దిశ‌గా వెళ్లాడు. ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఆసీస్ ఇన్నింగ్స్ ను ఆరోన్ ఫించ్, మార్కస్ హారిస్ ప్రారంభించగా, తొలి ఓవర్ ను ఇషాంత్ శర్మ వేశాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -