Thursday, May 2, 2024
- Advertisement -

న్యూజిలాండ్ గ‌డ్డ‌పై టీమిండియాను ఊరిస్తున్న 52 ఏళ్ల రికార్డు..సాధిస్తారా…?

- Advertisement -

విదేశాల్లో టీమిండియా దుమ్మురేపుతోంది. టెస్ట్‌, వ‌న్డే సిరీస్‌ల‌లో ఆసిస్‌ను మ‌ట్టిక‌రిపించిన టీమిండియా న్యూజిలాండ్ గ‌డ్డ‌పై కూడా స‌త్తా చాటుతోంది. ఐదు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా రెండు వ‌న్డేలు మిగిలి ఉండ‌గానే 3-0తో గెలిచి సీరిస్‌ను కైవ‌సం చేసుకుంది. సిరీస్ క్లీన్ స్వీప్ చేయాల‌ని టీమిండియా ప‌ట్టుద‌ళ‌తో ఉంది.

అయితే కీవీస్ గ‌డ్డ‌పై 52 ఏళ్ల రికార్డు భార‌త్ ను ఊరిస్తోంది. 1967 నుంచి న్యూజిలాండ్ లో భారత్ పర్యటిస్తోంది. ఒక్కసారి మాత్రమే 3-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. 2008-09. అది కూడా రేపు జరగనున్న వన్డేలో గెలిస్తే కివీస్ గడ్డపై 4-0 తేడాతో గెలుపొంది, అత్యుత్తమ రికార్డును సొంతం చేసుకుంటుంది . ఇటీవల ఆస్ట్రేలియా గడ్డపై 72 ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత్ జట్టు టెస్టు సిరీస్ గెలిచిన విషయం తెలిసిందే.

ప్ర‌పంచ‌క‌ప్ ఉన్న నేపధ్య‌లో టీమిండియా మేనేజ్ మెంట్ కోహ్లీకి విశ్రాంతి నిచ్చిన సంగ‌తి తెలిసిందే. కోహ్లీ స్థానంలో రోహిత్ శ‌ర్మ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. జట్టు బలం కొంచెం తగ్గనున్నా.. తొడ కండరాల గాయంతో మూడో వన్డేకి దూరమైన ధోనీ రేపు మళ్లీ టీమ్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడని వార్తలు వస్తుండటంతో సమతూకం రానుంది. రేపు ఉదయం 7.30 గంటలకు హామిల్టన్ లో నాలుగో వన్డే జరగనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -