Tuesday, April 30, 2024
- Advertisement -

టీం ఇండియాకు మ‌రో ఓటమి త‌ప్పదా?

- Advertisement -

టీం ఇండియాకు మ‌రో ఓట‌మి త‌ప్పేలా లేదు. ఇంగ్లండ్ గ‌డ్డ మీద టెస్ట్ సిరీస్ గెల‌వ‌డ‌మే ల‌క్ష్యంగా అక్క‌డికి వెళ్లిన ఇండియా త‌మ స్థాయి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డంలో పూర్తిగా విఫ‌లం అయింది. చివరిదైన ఐదో టెస్టులో శనివారం రెండో రోజు ఆట పూర్తయ్యాక పరిస్థితి చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ కోహ్లి ( 49), ఓపెనర్‌ రాహుల్‌ ( 37), పుజారా (37) భారీ స్కోర్లుగా మలచలేకపోయారు.

కొత్త కుర్రాడు హనుమ విహారి (25 బ్యాటింగ్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), ఆల్‌రౌండర్‌ జడేజా (8 బ్యాటింగ్‌) పోరాడుతున్నారు. స్వింగ్‌తో చెలరేగిన అండర్సన్‌ (2/20) కీలక వికెట్లు పడగొట్టాడు.అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 198/7తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ 332 పరుగులకు ఆలౌటైంది. ‘బర్త్‌ డే బాయ్‌’ జాస్‌ బట్లర్‌ ( 89) ఫటాఫట్‌ ఇన్నింగ్స్‌తో జట్టుకు మంచి స్కోరు అందించాడు. భారత బౌలర్లలో జడేజా (4/79)కు నాలుగు వికెట్లు దక్కాయి.ఇంక ఇండియా ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 158 పరుగులు వెనుకబడి ఉంది.మ‌రి ఈ టెస్ట్‌లో కూడా ఇండియాకు ఓట‌మి త‌ప్పేలా లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -