Monday, April 29, 2024
- Advertisement -

స‌ఫారీగ‌డ్డ‌పై టీమిండియాకు త‌రుపుముక్క హార్ధిక్ పాండ్యా… స‌చిన్ టెండుల్క‌ర్ ..

- Advertisement -

దక్షిణాఫ్రికా గడ్డ మీద భారత్ తొలిసారి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుందనే విశ్వాసాన్ని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ వ్యక్తం చేశాడు. సఫారీ గడ్డపై ఎదురయ్యే పరీక్షలను తట్టుకునేలా టీమిండియా సమతూకంతో ఉందని సచిన్ తెలిపాడు. కోహ్లికి వ్యక్తిగతంగానే కాకుండా, జట్టు మొత్తానికి సౌతాఫ్రికా, ఇంగ్లాండ్‌ల్లో సవాళ్లు ఎదురవుతాయి. కానీ భారత్ తగిన విధంగా సన్నద్ధమైందని సచిన్ అభిప్రాయపడ్డాడు.

ప్రాథమిక నియమాలు కట్టుబడి మామూలుగా ఆడితే సరిపోతుందని సూచించిన సచిన్.. స్కోరుబోర్డు మీద తగినన్ని పరుగులు ఉంటేనే విజయం సాధించగలమని చెప్పాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో హార్దిక్ పాండ్య కోహ్లికి తురుపు ముక్క అవుతాడని సచిన్ జోస్యం చెప్పాడు.

నేను ఆడిన 24 ఏళ్లలో భారత్ ఇంత సమతూకంతో ఎప్పుడూ లేద‌న్నారు. పాండ్యా 17-18 ఓవర్ల బౌలింగ్ చేయగలడు, ఏడు లేదా ఎనిమిదో స్థానంలో పరుగులు రాబట్టగలడు. ఈ సిరీస్‌లో పాండ్య కోహ్లికి పెద్ద ఆయుధం అవుతాడ’ని మాస్టర్ తెలిపాడు.

పాండ్య నాలుగో ఫాస్ట్ బౌలర్ స్థానాన్ని భర్తీ చేయగలడు. మిడిలార్డర్‌లో చక్కగా రాణించడంతోపాటు.. మైదానంలోనూ చురుగ్గా కదులుతాడు. దీంతో భారత్ ముగ్గురు పేసర్లతో బరిలో దిగే అవకాశం లభిస్తోంది. ప్రస్తుత జట్టు సమతూకంతో ఉందని మాస్టర్ తెలిపాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -