Wednesday, May 8, 2024
- Advertisement -

మరే భారత క్రికెటర్ కూ సాధ్యంకాని రికార్డును సొంతం చేసుకున్న భువనేశ్వర్ కుమార్..

- Advertisement -

భారత క్రికెట్ చరిత్రలో బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఓ సరికొత్త అధ్యాయాన్ని సృష్టించాడు. మూడు క్రికెట్ ఫార్మాట్లలో ఒకే మ్యాచ్ లో 5 వికెట్లు తీసిన ఘనత సాధించిన ఏకైక భారత బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసిన భువీ, మూడు ఫార్మాట్లలో ఇదే ఫీట్ సాధించిన వాడిగా నిలిచాడు.

భారత్ తరఫున టీ20ల్లో ఐదు వికెట్ల హాల్ సాధించిన రెండో బౌలర్ భువీ. గతేడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20లో చాహల్ ఆరు వికెట్లు తీశాడు. చిన్నస్వామి స్టేడియంలో 4 ఓవర్లు వేసిన చాహల్ 25 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో భారత్ తరఫున ఇవే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు.

ఇప్పటికే 21 టెస్టులాడిన భువీ, 4 సార్లు ఐదు వికెట్లను పడగొట్టిన ఘనతను సొంతం చేసుకున్నాడన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో 86 వన్డే మ్యాచ్ లు ఆడి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన ఘనతను ఒకసారి దక్కించుకున్నాడు. కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే వేయగలిగే అవకాశం ఉండే టీ-20 మ్యాచ్ లోనూ ఐదు వికెట్లను తీయడంతో ఇప్పుడు భువీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పలువురు మాజీ క్రికెటర్లు, ప్రస్తుత టీమ్ మేట్స్ భువనేశ్వర్ ను అభినందనలతో ముంచెత్తుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -