Sunday, April 28, 2024
- Advertisement -

కోహ్లీ, రోహిత్ మధ్య ఉన్న విబేధాలకు చెక్ పెట్టిన బీసీసీఐ..క్లారిటీ ఇచ్చిన కోహ్లీ

- Advertisement -

ప్రపంచ కప్ వైఫల్యం నుంచి గత కొన్ని రోజులుగా కోహ్లీ, రోహిత్ ల మధ్య విబేధాలు టీమిండియాలో ప్రకంపనలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే విరాట్ కోహ్లీని, అతని భార్య అనుష్క శర్మను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ ఫాల్ చేయడం కూడా ఊహాగానాలను మరింత పెంచింది. అయితే, వీరిద్దరి మధ్య వివాదం వాస్తవమేనని, దీన్ని సద్దుమణిగేలా చేసేందుకు బీసీసీఐ రంగంలోకి దిగి ఆ వార్తలకు పుల్ స్టాప్ పెట్టింది. కోచ్ రవిశాస్త్రి, కోహ్లీ ప్రెస్ మీట్ పెట్టి విబేధాలపై క్లారిటీ ఇచ్చారు. తమ మద్య ఎలాంటి విబేధాలు లేవని కోహ్లీ క్లారిటీ ఇచ్చారు.

డ్రెస్సింగ్ రూమ్ వాతావ‌ర‌ణం కీల‌క‌మైంద‌ని, స‌క్సెస్‌కు అదే కార‌ణ‌మ‌ని కోహ్లీ అన్నాడు. ఒక‌వేళ మీర‌న్న‌ట్టుగా రోహిత్‌తో విభేదాలు ఉన్న‌ట్లు నిజ‌మే అయితే, అప్పుడు మేం ఇంత గొప్ప‌గా ఆడేవాళ్లం కాదు అని కోహ్లీ చెప్పాడు. ఒక‌వేళ ఒక వ్య‌క్తి నాకు న‌చ్చ‌క‌పోతే.. దాన్ని మీరు నా ముఖంలోనో, నా ప్ర‌వ‌ర్త‌న‌లోనూ చూస్తార‌ని కోహ్లీ అన్నాడు. మా ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ సృష్టించ‌డం వ‌ల్ల ఎవ‌రు లాభ‌ప‌డుతారో తెలియ‌ద‌ని కోహ్లీ అన్నాడు. మరో వైపు రోహిత్‌, విరాట్ మ‌ధ్య విభేదాలు ఉన్న‌ట్లు వాస్తున్న వార్త‌ల‌ను కోచ్ ర‌విశాస్త్రి కూడా ఖండించాడు. ఒక‌వేళ అదే నిజ‌మైతే మూడు ఫార్మాట్ల‌లోనూ ఒకే ర‌క‌మైన నిల‌క‌డ ప్ర‌ద‌ర్శ‌న కుద‌ర‌ద‌ని శాస్త్రి అన్నాడు. ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవని అవన్నీ వదంతులే నని కొట్టి పారేశారు. ప్రపంచకప్ సెమీఫైనల్‌లో టీమ్‌ఇండియా ఓటమే కోహ్లీ- రోహిత్ మధ్య విభేదాలకు కారణమైందనె వార్తలు హల్ చేస్తున్న సంగతి తెలిసిందే. కెప్టెన్ నిర్ణయాల వల్లే మ్యాచ్ చేజారిందని, తాను ఐదు శతకాలు చేసి ఎంతో కష్టపడితే అంతా వృథా చేశారని రోహిత్ ఆవేదన చెందినట్టు వార్తలొచ్చాయి. వీటన్నింటికి కోహ్లీ, రవిశాస్త్రి పుల్ స్టాప్ పెట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -