Tuesday, May 7, 2024
- Advertisement -

గేల్ దూకుడుకు ఢిల్లీడేర్ డేవిల్స్ అడ్డుక‌ట్ట వేయ‌గ‌ల‌దా…?

- Advertisement -

ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో కింగ్స్ లెవెన్ పంజాబ్ విజ‌యాల్లో దూస‌కుపోతోంది. ఆ జ‌ట్టు ఓపెన‌ర్లు క్రిస్‌గేట్‌, కేఎల్ రాహుళ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. క్రిస్ గేల్ అయితే చెప్పాల్సిన ప‌నిలేదు. ఆడిన అన్ని మ్యాచ్‌ల‌ల్లోనూ భారీ స్కోరు సాధించాడు. మ‌రో వైపు ఢిల్లీడేర్ డేవిల్స్ జ‌ట్టు పేవ‌ల‌మైన ఆట‌తీరును కొన‌సాగిస్తోంది. పాయంట్ల ప‌ట్టిక‌లో చివ‌రిస్థానంలో ఉంది.

టోర్నీలో ఇప్పటికే ఓసారి ఢీకొన్న ఈ రెండు జట్లూ.. సోమవారం రాత్రి 8 గంటలకి ఫిరోజ్ షా కోట్ల వేదికగా మరోసారి తలపడబోతున్నాయి. టోర్నీలో ఆడిన గత మూడు మ్యాచ్‌ల్లోనూ ఒక శతకం, రెండు అర్ధశతకాలతో ఒంటిచేత్తో పంజాబ్‌ని గెలిపించిన క్రిస్‌గేల్.. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.

ఢిల్లీ డేర్ డేవిల్స్ జ‌ట్టు విష‌యానికి వ‌స్తే మాక్స్‌వెల్, శ్రేయాస్ అయ్యర్ ఫామ్‌లో లేకపోవడం, ఒక మ్యాచ్ మినహా కెప్టెన్ గంభీర్, ఓపెనర్ జేసన్ రాయ్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోవడంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఒత్తిడిలో ఉంది. బెంగళూరుతో గత శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 174 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ బౌలర్లు పేలవ బౌలింగ్ కారణంగా కాపాడుకోలేకపోయారు. ఆ మ్యాచ్‌లో డివిలియర్స్ జోరు ముందు బౌలర్లు అందరూ తేలిపోయి భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఆ నేప‌థ్యంలో క్రిస్‌గేల్, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ జోరుకి ఢిల్లీ బౌలర్లు అడ్డుకట్ట వేయడంపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.

టోర్నీలో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లాడిన పంజాబ్ జట్టు నాలుగు మ్యాచ్‌లో గెలుపొందగా.. ఢిల్లీ కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయాన్ని అందుకుంది. సీజన్‌లో గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఢిల్లీ ఓడిపోగా.. గత మూడు మ్యాచ్‌ల్లోనూ పంజాబ్ ఘన విజయాల్ని అందుకుంది. టోర్నీలో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లాడిన పంజాబ్ జట్టు నాలుగు మ్యాచ్‌లో గెలుపొందగా.. ఢిల్లీ కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయాన్ని అందుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -