Monday, April 29, 2024
- Advertisement -

ఐదుజ‌ట్లు..ఐదు మ్యాచ్‌లు …ప్లేఆఫ్‌కు చేరే రెండు జ‌ట్లు ఏవి…?

- Advertisement -

ఐదుజ‌ట్లు..ఐదు మ్యాచ్‌లు …ప్లేఆఫ్‌కు చేరేది రెండు జ‌ట్లు మాత్ర‌మే. ఆ రెండు జ‌ట్లు ఏవ‌నేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ప్లేఆఫ్ రేసులో నిల‌వాలంటే టీమ్‌ల‌కు క‌త్తిమీద సాములాంటిదే. ఇప్ప‌టికే సీఎస్‌కే, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ప్లే ఆఫలో చోటు సంపాదించాయి.

ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోహ్లి సేన సన్‌రైజర్స్‌పై 14 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. మరో రెండు స్థానాల కోసం ఐదు జట్లు పోటీ పడుతున్నాయి. మరి ప్లేఆఫ్ చేరడానికి ఈ ఐదు జట్ల ముందున్న అవకాశాలేంటో చూద్దాం.

కోల్‌కతా నైట్‌రైడర్స్:

శనివారం సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే కోల్‌కతా ఖాతాలో 16 పాయింట్లు చేరతాయి. ఓడితే మాత్రం బెంగళూరు, ముంబై ఇండియన్స్‌ తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడాలని ఆ జట్టు కోరుకోవాల్సిందే. రాజస్థాన్, పంజాబ్ కంటే మెరుగైన రన్‌రేట్ ఉండటం కోల్‌కతాకు కలిసి వచ్చే అంశం.

ముంబై ఇండియన్స్:

పంజాబ్‌పై మూడు పరుగుల తేడాతో గెలవడంతో.. ముంబై ఇండియన్స్ రన్‌రేట్ 0.405 నుంచి 0.384కి పడిపోయింది. రాజస్థాన్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో కోహ్లిసేన భారీ తేడాతో నెగ్గితే.. ఆర్‌సీబీ ప్లేఆఫ్ చేరుతుంది. అలా జరగొద్దంటే రోహిత్ సేన ఢిల్లీపై భారీ విజయం సాధించాలి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:

సన్‌రైజర్స్‌పె గెలిచిన బెంగళూరు ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. రాజస్థాన్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో గెలిస్తేనే మెరుగైన రన్‌రేట్ ఉన్న కోహ్లి సేన తదుపరి దశకు చేరుకునే ఛాన్స్‌లు ఎక్కువ.

రాజస్థాన్ రాయల్స్:

రహానే జట్టు ప్లేఆఫ్ చేరాలంటే బెంగళూరుపై గెలవడంతోపాటు ఢిల్లీ చేతుల్లో ముంబై ఓడాలి. ఒకవేళ చెన్నై మీద పంజాబ్ గెలిచినా..మెరుగైన రన్‌రేట్ ఉండటంతో రాజస్థాన్ తదుపరి దశకు చేరుతుంది. నెట్ రన్‌రేట్ తలనొప్పులు తప్పాలంటే.. ఆర్‌సీబీపై భారీ తేడాతో రాజస్థాన్ గెలవాలి.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్:

ఇప్పటికే ప్లేఆఫ్ చేరిన ధోనీ సేనను భారీ తేడాతో ఓడించడంతోపాటు రాజస్థాన్ ఆర్‌సీబీని ఓడించాలి. ముంబై కూడా ఢిల్లీ చేతుల్లో ఓడాలి. అలాగైతేనే పంజాబ్ నెట్‌ రన్ రేట్ రాజస్థాన్ కంటే మెరుగ్గా ఉండటంతోపాటు తదుపరి దశకు అర్హత సాధిస్తుంది. అంటే కోహ్లిసేనపై రాజస్థాన్ గెలవాలని మిగతా మూడు జట్లు కూడా కోరుకుంటున్నాయి. ప్లేఆఫ్‌కు ఏజ‌ట్లు చేరుతాయో అస‌క్తిక‌రంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -