Monday, April 29, 2024
- Advertisement -

ఆర్సీబీ క‌థ కంచికే….ముంబ‌య్ చేతిలో మ‌రో ఓట‌మి

- Advertisement -

ఐపీఎల్ 2019 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ క‌థ కంచికి చేరింది. వరుసగా ఆరు ఓటమిల తర్వాత గత మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ).. మరోసారి పరాజయాన్ని చవిచూసింది. ఐపీఎల్‌లో భాగంగా స్థానిక వాంఖెడే మైదానంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో రోహిత్‌ సేన ఘన విజయం సాధించింది. దీంతో ముంబై ఖాతాలో ఐదో విజయం నమోదు కాగ.. ఆర్సీబీ ఏడో ఓటమి చవిచూసింది.

ఈ మ్యాచ్‌లో డికాక్ (40: 26 బంతుల్లో 5×4, 2×6), హార్దిక్ పాండ్య (37 నాటౌట్: 16 బంతుల్లో 5×4, 2×6) చెలరేగడంతో 172 పరుగుల లక్ష్యాన్ని మరో 6 బంతులు మిగిలి ఉండగానే ముంబయి ఇండియన్స్ 5 వికెట్ల కోల్పోయి ఛేదించేసింది. అనంతరం సూర్యకుమార్‌(29), ఇషాన్‌ కిషాన్‌(21) రాణించారు. అయితే కృనాల్‌ పాండ్యా(21 బంతుల్లో 11) జిడ్డుగా ఆడటంతో విజయం ఆలస్యమైంది. చివర్లో హార్దిక్‌ పాండ్యా(37నాటౌట్‌; 16 బంతుల్లో 5పోర్లు, 2 సిక్సర్లు)మెరుపులు మెరిపించడంతో ముంబై విజయం ఖరారైంది. ఆర్సీబీ బౌలర్లలో మొయిన్‌ అలీ, చహల్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్‌ ఒక్క వికెట్‌ దక్కించుకున్నాడు.

అంత‌కు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ ఏబీ డివిలియర్స్ (75: 51 బంతుల్లో 6×4, 4×6), మొయిన్ అలీ (50: 32 బంతుల్లో 1×4, 5×6) అర్ధశతకాలు బాదడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. లసిత్‌ మలింగా నాలుగు వికెట్లు సాధించగా, హార్దిక్‌ పాండ్యా, బెహ్రాన్‌డార్ఫ్‌లు తలో వికెట్‌ తీశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -