Wednesday, May 8, 2024
- Advertisement -

ఐపిఎల్ వేలంలో అమ్మ‌డుపోనీ గేల్‌…ఎవ‌రెవ‌రెంత రేటు ప‌లికారంటె..

- Advertisement -

పది సీజన్లు ముగించుకున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) పదకొండో సీజన్‌ కోసం ఆటగాళ్ల వేలం ప్రారంభించింది. క్రికెట్‌ అభిమానుల్లో ఆసక్తిని, ఉత్కంఠను రెకెత్తిస్తున్న ఈ వేలంలో తొలి ఆటగాడిగా ఉన్న శిఖర్‌ ధావన్‌ను పాత జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంతం చేసుకుంది. ఈ వేలంలో ముంబై ఇండియన్స్‌, పంజాబ్‌, సన్‌రైజర్స్‌ జట్లు పోటీపడగా చివరికి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ.5.2 కోట్లకు ధావన్‌ను కొనుగోలు చేసి ధావన్‌పై నమ్మకాన్ని ఉంచింది.

వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ కు ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్ కు జరుగుతున్న వేలం పాటలో క్రిస్ గేల్ ను కొనుగోలు చేయడానికి ఫ్రాంఛైజీలు ముందుకు రాలేదు. గత ఏడాది ఐపీఎల్ వేలంలో రూ. 14.50 కోట్లకు అమ్ముడుపోయిన స్టోక్స్ ఈ ఏడాది అంత ధర పలకలేదు. రూ. 12.5 కోట్లకే ఆయనను రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది.

శిఖర్ ధావన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 5.2 కోట్లకు కొనుగోలు చేసింది. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ రూ. 7.6 కోట్లతో దక్కించుకుంది. రూ. 2 కోట్ల కనీస ధరలో వేలానికి వచ్చిన అశ్విన్ భారీ మొత్తానికి అమ్ముడుపోవడం విశేషం. కీరన్ పొలార్డ్ ను ముంబై ఇండియన్స్ రూ. 5.4 కోట్లకు సొంత చేసుకుంది. వేలం ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -