Monday, April 29, 2024
- Advertisement -

ముంబ‌య్ చేతితో చిత్తుగా ఓడిన కేకే… ప్లేఆప్‌కు చేరిన హైద‌రాబాద్‌

- Advertisement -

ప్లేఆప్‌కు చేరాలంటె త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో కోల్‌క‌తా చేతులెత్తేసింది. ముంబ‌య్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చిత్తుచిత్తుగా ఓడింది. దీంతో ల‌క్కీగా ప్లేఆప్‌కు హైద‌రాబాద్ చేరింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ తొమ్మిది వికెట్ల తేడాతో కోల్‌కతాపై ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు ముంబయి పేసర్లు లసిత్ మలింగ (3/35), హార్దిక్ పాండ్య (2/20), జస్‌ప్రీత్ బుమ్రా (2/31) ధాటికి వరుసగా వికెట్లు చేజార్చుకుని 133/7కే పరిమితమైంది.

క్రిస్‌ లిన్‌ (29 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడగా, రాబిన్‌ ఉతప్ప (47 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్సర్లు) నెమ్మదైన ఇన్నింగ్స్‌ జట్టుకు తీవ్ర నష్టం కలిగించింది. మలింగ 3 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీయగా… ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హార్దిక్‌ పాండ్యా, బుమ్రా చెరో 2 వికెట్లు పడగొట్టారు.

అనంత‌రం బ్యాటింగ్ కు దిగిన ముంబై 16.1 ఓవర్లలో వికెట్‌ కోల్పోయి 134 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (48 బంతుల్లో 55 నాటౌట్‌; 8 ఫోర్లు), సూర్య కుమార్‌ (27 బంతుల్లో 46 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రెండో వికెట్‌కు అభేద్యంగా 60 బంతుల్లోనే 88 పరుగులు జోడించి విజయాన్ని ఖాయం చేశారు.మ్యాచ్‌లో పొదుపు బౌలింగ్‌ చేసిన కీలక వికెట్లు పడగొట్టిన హార్దిక్ పాండ్యాకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

ఈ మ్యాచ్ ఫలితంతో తాజా సీజన్‌లో ప్లేఆఫ్‌కి చేరిన జట్లుగా ముంబయి ఇండియన్స్ (18 పాయింట్లు), చెన్నై సూపర్ కింగ్స్ (18), ఢిల్లీ క్యాపిటల్స్ (18), సన్‌రైజర్స్ హైదరాబాద్ (12) నిలిచాయి. ఐపీఎల్ 12 ఏళ్ల చరిత్రలో ఓ జట్టు కేవలం 12 పాయింట్లతో ప్లేఆఫ్‌కి చేరడం సరికొత్త రికార్డ్ సృష్టించింది హైద‌రాబాద్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -