Thursday, May 2, 2024
- Advertisement -

రెండో వ‌న్డేలో రానించిన ఓపెన‌ర్లు….కివీస్‌కు భారీ లక్ష్యం

- Advertisement -

న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో భార‌త్ భారీ స్కోరు చేసింది. ఓపెన‌ర్లు రోహిత్ (87 ; 96 బంతుల్లో 9X4, 3X6), శిఖ‌ర్ ధావ‌న్ ( 66; 67 బంతుల్లో 9X4, 0X6) ప‌రుగుల‌తో చెల‌రేగ‌డంతో టీమిండియా 4 వికెట్ల న‌ష్టానికి 324 ప‌రుగులు చేసింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ 60 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకోగా.. ఆపై ధావన్ కూడా అర్థ సెంచరీ పూర్తి చేశాడు.

ఈ క్రమంలో ఇద్దరూ అర్ధశతకాలు పూర్తి చేసుకోగా.. జట్టు స్కోరు 154 వద్ద ధావన్, అనంతరం కొద్దిసేపటికే రోహిత్ శర్మ 172 వద్ద ఔటయ్యాడు. బౌల్ట్ బౌలింగ్‌లో బంతిని కట్ చేసే ప్రయత్నంలో ధావన్ వికెట్‌ కీపర్‌కి క్యాచ్ ఇవ్వగా.. ఫర్గూసన్ విసిరిన షార్ట్ లెంగ్త్ బంతిని సిక్స్‌గా తరలించేందుకు ప్రయత్నించి రోహిత్ శర్మ ఫీల్డర్ గ్రాండ్‌‌హోమ్ చేతికి చిక్కాడు

ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు ఇద్ద‌రు వంద ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్ప‌గా, ఇది 14వ సారి కావ‌డం విశేషం . భార‌త్ బ్యాట్స్‌మెన్స్‌లో విరాట్ కోహ్లీ ( 43 ; 45 బంతుల్లో 5X4, 0X6), రాయుడు (49 బంతుల్లో 47; 3 ఫోర్లు, 1 సిక్స్‌), ధోని (33 బంతుల్లో 48 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), కేదార్ జాద‌వ్ (10 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్స్‌, 1 సిక్స్‌) ప‌రుగులు చేశారు. ఈ సిరీస్‌లో ఇప్ప‌టికే భార‌త్ 1-0 ఆధిక్యంలో ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -