Wednesday, May 8, 2024
- Advertisement -

విమ‌ర్శ‌ల‌పై ఎట్ట‌కేల‌కు స్పందించిన విజ‌య్ శంక‌ర్‌..

- Advertisement -

బంగ్లాదేశ్‌తో కొలంబో వేదికగా గత ఆదివారం ముగిసిన ముక్కోణపు టీ20 సిరీస్ ఫైనల్లో పేలవ ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొంటున్న భారత జట్టు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ ఎట్టకేలకి నోరు విప్పాడు. నిదహాస్‌ ట్రోఫీ ఫైనల్లో తన జిడ్డు బ్యాటింగ్‌తో శంకర్‌ భారత్‌ను ఓటమి అంచులకు చేర్చగా దినేశ్‌ కార్తీక్‌ చివరి బంతిని సిక్సుబాది గట్టెక్కించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శంకర్‌ బ్యాటింగ్‌పై అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ ఐదు బంతుల్ని వృథా చేయడం పట్ల ఇప్పటికీ నేను బాధపడుతున్నాను. మ్యాచ్‌ని ముగించే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. కానీ.. నేను చివరి ఓవర్‌లో ఫోర్ బాదిన తర్వాత.. మ్యాచ్‌ని ఫినిష్ చేయలేకపోయా. ఒకవేళ ఫోర్ తర్వాత ఓ సిక్స్ బాదింటే.. ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉండేవి. చివర్లో ఉత్కంఠ రాబోతుందని ఊహించి.. ముందుగానే మానసికంగా సిద్ధమయ్యా. కానీ.. ఒత్తిడిని జయించలేకపోయాన‌న్నారు.

అభిమానుల నుంచి ఇలాంటి విమ‌ర్శ‌లు రావ‌డం స‌హ‌జ‌మేన‌ని దానికి చింతించ‌డంలేద‌న్నారు. టోర్నీమొత్తం బంతితో రాణించానని కానీ చివరి రోజు ఓ చెడు దినంగా మిగిలిపోయిందన్నాడు. అది మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నానని, కానీ చాలా కష్టంగా ఉందని తెలిపాడు.

అభిమానులు విమ‌ర్శించినా జట్టులోని క్రికెటర్లంతా నాకు మద్దతుగా నిలిచారు. చివర్లో ఒత్తిడికి గురై.. విఫలమైన వాళ్లు చరిత్రలో చాలా మంది ఉన్నారని చెప్పి నాకు సాంత్వనం కలిగించే ప్రయత్నం చేశారు. ఐపీఎల్ సమయంలో ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో నేను ప్రాక్టీస్ చేశాను. కానీ.. మ్యాచ్‌లో మాత్రం అతడి బౌలింగ్‌ని ఎదుర్కోలేకపోయా. అతని ఓవర్‌లోనే వరుసగా నాలుగు డాట్ బాల్స్ పడటంతో నాలో ఒత్తిడి తారాస్థాయికి చేరింది. చివర్లో అద్భుతంగా ఆడి మ్యాచ్‌ని గెలిపించిన దినేశ్ కార్తీక్‌కి థ్యాంక్స్’ అని విజయ్ శంకర్ వివరించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -