Monday, April 29, 2024
- Advertisement -

టీ20ల్లోఒకే రోజు నాలుగు రికార్డులు నెల‌కొల్పిన‌ రోహిత్‌..

- Advertisement -

టీ20ల్లో భార‌త హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ ఒకే రోజు నాలుగు రికార్డులు నెల‌కొల్పాడు. రోహిత్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో 29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధ సెంచరీ (50) చేసిన రోహిత్ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 7వికెట్ల‌తో ఘ‌న‌విజ‌యం సాధించింది. 50 పరుగులు చేయడం ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.

త‌రువాతి స్థానాల్లో వ‌రుస‌గా 2272 పరుగులో గప్తిల్ రెండో స్థానం, 2263 పరుగులతో షోయబ్ మాలిక్, 2167 పరుగులతో విరాట్ కోహ్లీ, 2140 పరుగులతో బ్రెండన్ మెకల్లమ్ వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. టీ20ల్లో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన రికార్డును కూడా రోహిత్ సొంతం చేసుకున్నాడు. తాజా అర్ధ సెంచరీతో 20 సార్లు ఆ ఘనత సాధించి ఈ జాబితాలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. 19 అర్ధ సెంచరీలతో కోహ్లీ రెండో స్థానంలో నిలిచారు.

తక్కువ వ్యవధిలోనే టీ20ల్లో ఎక్కువ విజయాల్ని అందుకున్న టీమిండియా కెప్టెన్‌గానూ రోహిత్ శర్మ నిలిచాడు. అతని కెప్టెన్సీలో 14 టీ20లు ఆడిన భారత్ ఏకంగా 12 మ్యాచ్‌ల్లో గెలుపొందడం విశేషం. మ్యాచ్‌లో 4 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ.. టీ20ల్లో 100 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. రికార్డ్‌లో క్రిస్‌గేల్, మార్టిన్ గప్తిల్ సంయుక్తంగా 103 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా.. తర్వాత స్థానంలో రోహిత్ శర్మ 102 సిక్సర్లతో నిలిచాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -