Monday, April 29, 2024
- Advertisement -

బెంగులూరుపై పోరాడి ఓడిన హైద‌రాబాద్‌…ప్లేఆఫ్ ఆశ‌లు నిలుపుకున్న కోహ్లీసేన‌

- Advertisement -

కచ‍్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు సత్తా చాటింది. ఐపీఎల్ 2018 సీజన్‌లో ప్లేఆఫ్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజ‌యం సాధించి ప్లే ఆఫ్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. గురువారం జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌పై కోహ్లీ సేన 14 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది.

చిన్నస్వామి స్డేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత హిట్టర్లు ఏబీ డివిలియర్స్ (69: 39 బంతుల్లో 12×4, 1×6), మొయిన్ అలీ (65: 34 బంతుల్లో 2×4, 6×6), గ్రాండ్ హోమ్ (40: 17 బంతుల్లో 1×4, 4×6) చేలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో6 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోరు చేసిన బెంగళూరు జట్టు.

ఛేదనకు దిగిన హైదరాబాద్ జట్టును శ్రమకోర్చి 204/3కి కట్టడి చేసింది. ఛేదనలో ఓపెనర్లు ధావన్ (18), అలెక్స్ హేల్స్ (37) విఫలమైనా.. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (81: 42 బంతుల్లో 7×4, 5×6), మనీశ్ పాండే (62 నాటౌట్: 38 బంతుల్లో 7×4, 2×6) అసాధారణ ఇన్నింగ్స్ ఆడటంతో.. ఒకానొక దశలో బెంగళూరు చేతి నుంచి మ్యాచ్ చేజారేలా కనిపించింది. కానీ.. ఆఖరి 6 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన దశలో తొలి బంతికే విలియమ్సన్ ఔటవడంతో.. మ్యాచ్‌ మళ్లీ బెంగళూరు వైపు మొగ్గింది. చివరి బంతి వరకూ క్రీజులో నిలిచిన మనీశ్ పాండే ఒత్తిడికి గురై పేలవ షాట్లు ఆడటంతో సీజన్‌లో హైదరాబాద్ జట్టుకి నాలుగో ఓటమి తప్పలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -