Tuesday, May 7, 2024
- Advertisement -

సిక్స‌ర్ల‌కోసం ప్ర‌య‌త్నించి స‌చిన్‌ను ఔట్ అయ్యేవారు.. సౌతాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ పైనీ డివిలియర్స్

- Advertisement -

రెండు దశాబ్దాల పాటు ప్రపంచంలోని అగ్రశ్రేణి బౌలర్లు సైతం నిద్రలేని రాత్రులు గడిపేలా చేసిన భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్‌. స‌చిన్‌ని ఔట్ చేయాలంటే బౌల‌ర్లు నానాతంటాలు ప‌డేవారు. అయితే తెలివిగా ఔట్ చేసేవాడినని దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ పైనీ డివిలియర్స్ వెల్లడించాడు. భారత్ జట్టు తాజాగా దక్షిణాఫ్రికా గడ్డపై పర్యటిస్తున్న నేపథ్యంలో గతంలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఆసక్తికరమైన మ్యాచ్‌ల గురించి పైనీ మంగళవారం గుర్తు చేసుకున్నాడు.

1990లో బౌలర్లకి సచిన్ తెందుల్కర్ కొరకరాని కొయ్యగా మారాడని.. బంతి ఏ మాత్రం గతి తప్పినా మైదానం వెలుపల పడేలా బాదేసేవాడని పైనీ వివరించాడు. సచిన్ తెందుల్కర్ నా బౌలింగ్‌ని లెక్క చేసేవాడు కాదు. ముఖ్యంగా నేను అప్పుడప్పుడు విసిరే స్లో బంతుల్ని అయితే.. గ్రౌండ్‌ వెలుపలకి బాదేసేవాడు. ఆఫ్ కట్టర్ రూపంలో విసిరే ఆ స్లో బంతులకి ఉప ఖండం పిచ్‌లపై సాధారణంగా బ్యాట్స్‌మెన్ ఎక్కువగా క్యాచ్ ఔట్ అయ్యేవారు. కానీ.. సచిన్ తెందుల్కర్‌ మాత్రం వెనుకంజ వేయకుండా హిట్టింగ్ చేసేవాడ‌ని చెప్పారు.

అతడ్ని ఔట్ చేసేందుకు మళ్లీ.. మళ్లీ అవే బంతుల్ని సంధించేవాడ్ని. ఈ క్రమంలో నాలుగు సార్లు సచిన్‌ని ఔట్ చేయగలిగా’ అని పైనీ డివిలియర్స్ వెల్లడించాడు. ఈ ఇద్దరూ తలపడిన మ్యాచ్‌ల్లో మొత్తం 16 సార్లు సచిన్ ఔటవగా.. ఇందులో నాలుగు సార్లు పైనీనే దిగ్గజ క్రికెటర్ వికెట్ తీయడం కొసమెరుపు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -