Thursday, May 2, 2024
- Advertisement -

స‌చిన్ క్రికెట్ గురువు అచ్రేకర్ క‌న్ను మూత‌..

- Advertisement -

క్రికెట్‌లో అనితర సాధ్యమైన రికార్డులెన్నో సృష్టించి… ‘క్రికెట్ దేవుడుఇగా ’గా గుర్తింపు పొందిన స‌చిన్ తెందుల్కర్‌ గురువు రమాకాంత్ అచ్రేకర్ కన్నుమూశారు. కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రమాకాంత్… బుధవారం తన నివాసంలో మృత్యువాత పడ్డారు. సచిన్, వినోద్ కాంబ్లిలకు పాఠశాల స్థాయిలో ఆచ్రేకర్ క్రికెట్లో శిక్షణ ఇచ్చారు. ముంబైలోని శివాజీ పార్కులో యువ క్రికెటర్లకు ఆచ్రేకర్ శిక్షణ ఇచ్చారు.

అచ్రేకర్ 1932లో జన్మించారు. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ సుధీర్ఘ కాలం పాటు కొనసాగడంలో ఆయన పాత్ర ఎనలేనిది. స‌చిన్ గొప్ప క్రికెట‌ర్‌గా ఎదిగాడంటే గురువు అచ్రేకర్ కృషి ఎన‌లేనిది. గురుపౌర్ణిమ సందర్భంగా అంద‌రూ గుడికి వెళ్లి దేవుడ్ని దర్శించుకుంటే.. సచిన్ మాత్రం తన గురువైన రమాకాంత్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకుంటాడు.

భారతదేశానికి ఓ మేటి క్రికెటర్‌ను అందించడంలో కీలక పాత్ర పోషించిన రమాకాంత్‌కు “లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు”ను ముంబై శివాజీ పార్క్‌ జింఖానా శతాబ్ధి వార్షికోత్సవాల సందర్భంగా అందజేశారు. క్రికెట్‌ రంగంలో అసమాన సేవలందించినందుకు గాను 1990లో ద్రోణాచార్య, 2010లో పద్మశ్రీ అవార్డులతో ఆయనను కేంద్ర ప్రభుత్వం గౌరవించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -