దుమ్మురేపిన యువ బ్యాట్స్‌మెన్

- Advertisement -

భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ రికార్డు సృష్టించాడు. ఆడుతున్న మొదటి టెస్టులోనే సెంచరీ చేశాడు. ఇంతకు ముందే జాతీయ జట్టులో చోటు సంపాదిన శ్రేయస్‌కు టెస్టు మ్యాచ్‌లో ఆవకాశం లభించలేదు. దీంతో తన కల సాకారం అవుతుందా ? లేదా ? అనే దిగులుతో ఉండేవాడు ఈ యువ బ్యాట్స్‌మెన్.

మొదటి టెస్ట్‌కు ముందుకు ఓపెనర్ కేఎల్‌ రాహుల్ గాయం కారణంగా సిరీస్‌ మొత్తానికి దూరం కాగా.. అనుకోకుండా కేఎల్ రాహుల్‌ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. దీంతో అంది వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న అయ్యర్‌.. తన బ్యాట్‌ జులిపించాడు. కేవలం 171 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సుల సహాయంతో 105 పరుగులు చేశాడు. దీంతో ఆరంగ్రేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ రికార్డు నెలకొల్పాడు

- Advertisement -

మరో వైపు భారత్‌ ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌటైంది. భారత సీనియర్ బ్యాట్స్‌మెన్స్, రహానే, పుజారా విఫలమైనా.. శ్రేయస్‌ అయ్యర్‌ తోపాటు ఆల్‌ రౌండర్ రవింద్ర జడేజా హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో భారత జట్ట ఆ మాత్రం స్కోరైనా చెయ్యగలిగింది.

తిరుపతిలో వింత ఘటన.. క్యూ కడుతున్న జనం

సీఎం ఢిల్లీలో ఏంపీకారు చెప్పాలి..

బాబు సంస్కారానికి జగన్ నమస్కారం

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -