Wednesday, May 1, 2024
- Advertisement -

జింబాబ్వే పై భారత్ పంజా.. గ్రాండ్ విక్టరీ !

- Advertisement -

సూపర్ 12 లో భాగంగా టీమిండియా జింబాబ్వే మద్య జరిగిన మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించింది. పసికూన జింబాబ్వే పై 71 పరుగుల తేడాతో విజయం సాధించి గ్రూప్ 2 లో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో టీమిండియా దర్జాగా సెమీస్ లోకి అడుగుపెట్టింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేన నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఇక బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ తో తిరిగి ఫామ్ లోకి వచ్చిన టీమిండియా స్టార్ ఓపెనర్ కే‌ఎల్ రాహుల్ 35 బంతుల్లో 51 పరుగులు చేసి మరోసారి హాఫ్ సెంచరీతో రాణించాడు..

కెప్టెన్ రోహిత్ శర్మ (15 ) మరోసారి తక్కువ స్కోర్ తో నిరాశపరిచాడు. విరాట్ కోహ్లీ 25 బంతుల్లో 26 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. భీకర ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ మరోసారి తన విశ్వరూపం చూపిస్తూ 25 బంతుల్లోనే 61 పరుగులు చేసి జింబాబ్వే పై ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దాంతో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 186 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే ముందు ఉంచింది. ఆ తరువాత బ్యాటింగ్ లో రాణించిన రోహిత్ సేన బౌలింగ్ లోనూ అదరగొట్టింది.

ఆది నుంచే జింబాబ్వే బ్యాట్స్ మెన్స్ ను కట్టడి చేస్తూ వికెట్లు తీయడంతో జింబాబ్వే బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేశారు. భారత బౌలర్ల ధాటికి ఏ ధశలోనూ లక్ష్యాన్ని చేధించే విధంగా కనిపించలేదు. ర్యాన్ బర్ల్ 22 బంతుల్లో 34 పరుగులు, సికందర్ రజా 24 బంతుల్లో 34 చేసి కాస్త పరవలేదనిపించినప్పటికి మిగిలిన బ్యాట్స్ మెన్స్ రాణించలేకపోయారు. టీమిండియా బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీసి జింబాబ్వే పతనాన్ని శాసించాడు. మహ్మద్ శమి, హర్డిక్ పాండ్య చెరో రెండు వికెట్లు తీయగా, భువనేశ్వర్, హర్షదీప్ సింగ్ లకు తలో వికెట్ దక్కాయి. ఇక ఈ విజయంతో టీమిండియా పూర్తి ఆత్మవిశ్వాసంతో సెమీస్ లోకి అడుగుపెట్టింది ఈ నెల 10న సెమీఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఇంగ్లండ్ తో తలపడనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -