Thursday, May 2, 2024
- Advertisement -

T20 WORLDCUP 2022 : పసికూన నెదర్లాండ్ పై .. భారత్ గ్రాండ్ విక్టరీ !

- Advertisement -

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్నా టి20 వరల్డ్ కప్ లో భారత్ దూసుకుపోతోంది. మొన్న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై గెలిచి కొండంత ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్న రోహిత్ సేన.. అదే జోరు కొనసాగిస్తూ తాజాగా జరిగిన నెదర్లాండ్ పై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కే‌ఎల్ రాహుల్ 9 పరుగులు చేసి మరోసారి తక్కువ స్కోర్ కే వెనుదిరుగగా.. కెప్టెన్ రోహిత్ శర్మ క్లాస్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. 39 బంతుల్లో 53 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక విరాట్ కోహ్లీ తన ఫామ్ కొనసాగిస్తూ 44 బంతుల్లో 62 పరుగులు చేసి మరోసారి తన సత్తా చాటాడు.

ఇక రోహిత్ శర్మా అవుట్ తరువాత క్రీజ్ లోకి వచ్చిన మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ నెదర్లాండ్ బౌలర్స్ పై విరుచుకుపడ్డాడు. 25 బంతుల్లో 51 పరుగులు చేసి స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించాడు. ఇక ఈ ముగ్గురు హాఫ్ సెంచరీలతో మెరవడంతో రెండు వికెట్ల నష్టానికి 160 పరుగుల భారీ లక్ష్యాన్ని నెదర్లాండ్ ముందు ఉంచింది టీమిండియా. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్.. టీమిండియా భౌలర్ల ధాటికి కుదేలైంది. నెదర్లాండ్ బ్యాట్స్ మెన్స్ లో ఏ ఒక్కరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. దాంతో 120 పరుగులకే నెదర్లాండ్ కుప్పకూలింది. ఫలితంగా 56 పరుగుల తేడాతో నెదర్లాండ్ పై భారత్ భారీ విజాయన్ని సొంతం చేసుకుంది. దీంతో టీమిండియా గ్రూప్ బి నుంచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -