Monday, April 29, 2024
- Advertisement -

విరాట్ కోహ్లి సంపాదన.. వాళ్లను కూడా దాటి పోయాడు..

- Advertisement -

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. క్రికెట్ లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. అలానే అతని బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతోంది. అతనికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే కంపెనీలు అతడిపై కోట్లు గుమ్మరించేందుకు రెడీ అవుతున్నాయి. దీంతో విరాట్ సంపాదన పరంగానూ దూసుకెళ్తున్నాడు. ఎంతలా అంటే స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ, అమెరికన్ బాస్కెట్ బాల్ ప్లేయర్ స్టీప్ కర్రీ లాంటి అథ్లెట్లను కూడా వెనక్కి నెట్టేంతలా.

ఫోర్బ్స్ వెలువరించిన ప్రపంచంలోని టాప్ 10 రిచెస్ట్ అథ్లెట్ల జాబితాలో కోహ్లి ఏడోస్థానంలో ఉన్నాడు. భారత కెప్టెన్ బ్రాండ్ వాల్యూ 14.5 మిలియన్ డాలర్లని ఫోర్బ్స్ తెలిపింది.భారీ ఆర్జనతో క్రిస్టియానో రొనాల్డో, రోజర్ ఫెదరర్, ఉసేన్ బోల్ట్ తదితర దిగ్గజ అథ్లెట్ల సరసన విరాట్ స్థానం సంపాదించాడు. ఫోర్బ్స్ జాబితాలో 37.2 మిలియన్ డాలర్ల సంపాదనతో టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ అగ్రస్థానంలో ఉన్నారు. లిబ్రోన్ జేమ్స్ (33.4 మిలియన్ డాలర్లు), ఉసేన్ బోల్ట్ (27 మిలియన్ డాలర్లు) రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు. రొనాల్డో (21.5 మి. డాలర్లు), ఫిల్ మెకల్‌సన్ (19.6 మి. డాలర్లు), టైగర్ ఉడ్ (16.6 మి. డాలర్లు) వరుసగా నాలుగు, ఐదు, ఆరోస్థానాల్లో ఉన్నారు.

ఈ ఆదాయానికి ఆటగాళ్ల జీతభత్యాలు, బోనస్‌లు, ఇతర సంస్థల్లో వారి పెట్టుబడులు లాంటి ఆదాయాల్ని కలపలేదు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో శతకం బాదిన కోహ్లి (31 సెంచరీలు).. అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రిక్కీ పాంటింగ్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలోకి వచ్చాడు. ఇక సచిన్ (49) మాత్రమే టీమిండియా కెప్టెన్ కంటే ముందున్నాడు. ఈ ఏడాది వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడు కూడా కోహ్లినే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -