Thursday, May 2, 2024
- Advertisement -

అవినీతి నిరోధ‌క‌శాఖను విచార‌న‌కు ఆదేశించిన ఢిల్లీ గ‌వ‌ర్న‌ర్‌

- Advertisement -
pawan kalyan reaction on bahubali 2 movie

ఆప్ క‌న్వీన‌ర్ ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ రూ.2 కోట్లు లంచం తీసుకున్నార‌న్న ఆరోప‌న‌లు వ‌ద‌ల‌ట్లేదు.ఇప్పుడా కేసు ఆయ‌న మెడ‌కు చుట్టుకుంది.దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ లంచం తీసుకున్నారని వస్తున్న ఆరోపణలపై విచారణ చేపట్టాలని లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ అవినీతినిరోధక శాఖను ఆదేశించారు.

దీనిపై వెంటనే దర్యాప్తు చేపట్టి ఏడు రోజుల్లోగా నివేదిక అందించాలని స్పష్టం చేశారు. ఇది సరిపోదన్నట్లుగా పార్టీలో చోటు చేసుకున్న అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఢిల్లీ రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన మాజీ మంత్రి కపిల్ మిశ్రా.. ఢిల్లీ ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన కళ్ల ముందే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యశాఖా మంత్రి సత్యేంద్ర జైన్ నుంచి రూ.2కోట్ల లంచం తీసుకున్నట్లుగా ఆరోపించారు. అంతేనా.. కేజ్రీవాల్ తన బంధువుల కోసం రూ.50 కోట్ల భూదందాలను పరిష్కరించినట్లుగా కూడా తనతో మంత్రి జైన్ చెప్పారన్నారు.

మంత్రివర్గ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేదంటూ కపిల్‌ మిశ్రాను శనివారం మంత్రివర్గం నుంచి తప్పించారు. అయితే ఉద్వాసనకు గురైన అనంతరం కేజ్రీవాల్‌పై ఆరోపణలు చేశారు మిశ్రా. ‘దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారం నా కళ్ల ముందే ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ నుంచి రూ.2కోట్లు లంచం తీసుకున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి’ అని ప్రకటించారు. మంత్రి సత్యేంద్రజైన్ నుంచి 2 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారని కపిల్ మిశ్రా ఆరోపించారు. ఈ మేరకు ఆధారాలు కూడా కాసేపటి క్రితం అవినీతి నిరోధక శాఖకు సమర్పించారు. దీంతో గవర్నర్ అవినీతి నిరోధక శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై విచారణ చేసి, కేవలం ఏడురోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దీంతో అవినీతి నిరోధక శాఖాధికారులు పని ప్రారంభించారు.

Related

  1. లంచం తీసుకుంటుండ‌గా నేను క‌ల్లారా చూశా మంత్రి క‌పిల్ మిశ్రా
  2. అవినీతి ఆరోప‌న‌లు ఎదుర్కొంటున్న కేజ్రీ వెంట‌నే రాజీనామ చేయాలి కాంగ్రెస్ పార్టీ నేత అజ‌య్ మాకెన్‌
  3. ర‌స‌వ‌త్త‌రంగా మారిన‌ రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌
  4. ఉప్పు నీటిలోని ఐరన్‌కు గాలి తగలడంతో ఆ ప్రాంతంలోని నీళ్లు ఎరుపు రంగులోకి మారిపోతున్నాయి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -