Thursday, May 2, 2024
- Advertisement -

అత్తింటి వారికి పోటీ ఇవ్వనున్న సమంత?

- Advertisement -

ప్రస్తుతం దక్షిణ చానా చిత్ర పరిశ్రమ లో టాప్ 3 హీరోయిన్లలో తప్పకుండా కనిపించే పేరు సమంత. పెళ్ళికి ముందు ఎంత విజయం సాధించిందో, ఇప్పుడు పెళ్ళి తర్వాత కూడా అదే రేంజ్ లో విజయ పరంపర ని కంటిన్యు చేస్తూ ముందుకు వెళ్తుంది సమంత. ఇప్పుడు జులై 4 న విడుదల అవుతున్న ఓ బేబీ సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ తో ఫుల్ బిజీ గా ఉంది ఈ బ్యూటీ. సమంత త్వరలో దర్శకత్వం చేస్తుందా అనే అంశం పై అందరూ ఆమెని అడుగుతుండగా, ఈ విషయం పై సమంత క్లారిటీ ఇచ్చింది.

ఈ విషయం పై సమంత ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చింది. “నేను సినిమాలని డైరెక్ట్ చేయలేను. దర్శకత్వం నేను చేస్తాను అని కూడా అనుకోవడం లేదు. కానీ కచ్చితం గా భవిష్యత్తు లో మాత్రం నేను సినిమాలని నిర్మిస్తాను. అది పక్కా.” అని సమంత తెలిపింది.

అయితే సొంతంగా సినిమా నిర్మాణ సంస్థ ని స్థాపించి అత్తింటి వారి అన్నపూర్ణ స్టూడియోస్ కి పోటీ ఇస్తుందా లేక వారి బానర్ లో నే సినిమాలు నిర్మిస్తూ అక్కినేని లెగసీ ని ముందుకు తీసుకొని పోతుందా అనే విషయం తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -