లేటెస్ట్ అప్డేట్: తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా వైరస్

638
Telangana Coronavirus Latest Update
Telangana Coronavirus Latest Update

దేశంలో కరోనా కట్టడికి కేంద్రం లాక్డౌన్ చేపట్టింది. 21రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తున్నప్పటికీ కరోనా కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణలో కరోనాపై సీరియస్ ఫోకస్ పెట్టిన సర్కార్ తొలుత పాజిటివ్ కేసులు పెరగకుండా తగు చర్యలు చేపట్టింది. అయితే రెండ్రోరోజులుగా తెలంగాణలోనూ భారీగా కరోనా కేసులు పెరిగిపోవడంతో ఆందోళనలు నెలకొన్నాయి.

తెలంగాణలో బుధవారం ఒక్కరోజే 30పాజిటివ్ కేసులు నమోదుకాగా ముగ్గురు కరోనాతో మృతిచెందారు. దీంతో తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. కరోనా పాజిటివ్ కేసులు 127కు చేరుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో వెల్లడించారు. ఢిల్లీ మర్కజ్ కు కరోనా లింకు ఉండటంతో దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. దీంతో తెలంగాణ నుంచి ఢిల్లీ మర్కజ్ వెళ్లిన వారి వివరాలను సేకరించి వారిని కరోనా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మర్కజ్ వెళ్లొచ్చిన వారిలో 500మందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

వీరిలో 30మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. మిగతా వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించినట్లు సమాచారం. ఢిల్లీకి వెళ్లొచ్చిన 1030మందిలో 160మంది వివరాలను ఇంకా తెలియాల్సి ఉంది. వీరి నుంచి దాదాపు 2వేల మంది వరకు కరోనా వ్యాపించి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నారు. అయితే ప్రభుత్వం అన్నివిధలా వారి గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తోంది. ప్రత్యేక టీములు వారిని వెతికే పనిలో పడ్డాయి. త్వరలోనే వీరిని పట్టుకొని కరోనా ఆసుపత్రుల్లో చేర్చడం జరుగుతుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి కరోనా మహమ్మరి కట్టడికి సహకరించాలని సర్కార్ విజ్ఞప్తి చేస్తుంది.

Loading...