Tuesday, April 30, 2024
- Advertisement -

టీవీ, బైక్, ఫ్రిజ్ ఉంటే నో రేషన్!

- Advertisement -

కర్ణాటకలో బీపీఎల్ (దారిద్ర రేఖకు దిగువన) రేషన్ కార్డులకు అక్కడి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. టీవీ, ఫ్రిజ్, బైక్ ఉన్నవారు.. స్వచ్ఛందంగా రేషన్ కార్డును వదులుకోవాలని ప్రజలను కోరింది. ఆ వస్తువులు కలిగి ఉన్నవారు మార్చి 31 లోపు రేషన్ కార్డులను ప్రభుత్వానికి అప్పజెప్పాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉమేశ్ కత్తి అన్నారు. లేకుంటే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

బీపీఎల్ రేషన్ కార్డు పొందేందుకు కొన్ని అర్హతలు నిర్దేశించామని, ఐదెకరాలకు మించి భూమి ఉండరాదని, బైక్, టీవీ, ఫ్రిజ్ కలిగి ఉండకూడదని కర్ణాటక పౌర సరఫరాల శాఖ మంత్రి ఉమేశ్ కట్టీ వెల్లడించారు.  అంతే కాదు దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారి సంవత్సర ఆదాయం కనీసం ఏడాదికి రూ.1.20 లక్షల ఆదాయం పొందుతున్న వారు కూడా బీపీఎల్ రేషన్ కార్డులు వినియోగించేందుకు అనర్హులని, వారు కూడా కార్డులను ప్రభుత్వానికి అప్పగించాలని మంత్రి స్పష్టం చేశారు.

అయితే ఈ విషయంపై అక్కడి కాంగ్రెస్ నాయకులు గరం గరం అయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే యూటీ ఖాదర్ మాట్లాడుతూ.. సిద్ధరామయ్య సర్కారు హయాంలో తాను పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనూ ఈ ప్రతిపాదనలు వచ్చాయని వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల చాలామంది పేదలపై ప్రభావం పడుతుందని అన్నారు.

ఉప్పెన మూడు రోజుల్లో ఎంత వసూళ్లు రాబట్టిందంటే…!

స్పై ‘ఏజెంట్ వినోద్’గా కళ్యాణ్ రామ్ !

షర్మిలపై ఆవాకులు చెవాకులు మాట్లాడొద్దు : మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -