Tuesday, April 30, 2024
- Advertisement -

కరోనా కట్టడి కోసం.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌ మొదలైన తర్వాత మొదటి సారి అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో దాదాపు 24 వేలు కరోనా కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 8,136కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలన్నీ నిండిపోయాయి. బెడ్లు దొరకక ఆస్పత్రుల్లోని ఆరుబయటే వీల్‌ చైర్‌లో ట్రీట్‌మెంట్‌ పొందుతున్నారు కరోనా బాధితులు.

ఈ నేపథ్యంలో ఎపి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎల్లుండి నుంచి పగటి పూట కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిబంధనలు ఎల్లుండి మధ్యాహ్నం 12తర్వాత నుంచి అమలులోకి రానున్నాయి.

ఎపిలో 2వారాలపాటు ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకే దుకాణాలకు అనుమతిచ్చారు. నా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని సిఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఎపిలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

బంగ్లాదేశ్ లో ఓ ఘోరం.. పడవ మునిగి 25 మంది మృతి

ఆ సినిమాను పక్కన పెట్టి.. ఇంకో దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన నితిన్!

తమిళనాట విశ్వనటుడు అందుకే ఓడిపోయారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -