Friday, May 3, 2024
- Advertisement -

కరోనా వైరస్ గాలిలో 6 అడుగుల వరకు వ్యాప్తి.. జర జాగ్రత్త!

- Advertisement -

కరోనా సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ తుంపర్లు గాలిలో కొంత కాలం పాటు ఉంటాయని, వాటిని పీల్చడం వల్లే ఇతరులకు వైరస్‌ వ్యాపిస్తుందని, కరోనా వైరస్‌ సోకే విధానాల్లో ఇది అత్యంత ప్రధానమైనదని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) వెల్లడించింది. వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోకిన వ్యక్తి నుంచి 3 నుంచి 6 అడుగులలోపు వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని, వెంటిలేషన్ లేని ప్రాంతాల్లో 6 అడుగుల కంటే కాస్త ఎక్కువ దూరం వ్యాప్తికి అవకాశం ఉంటుందని చెప్పింది.

మాట్లాడటం, పాడటం, ఎక్సర్సయిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం, దగ్గడం, చీదడం, శ్వాసక్రియ వల్ల బయటకు వచ్చే చిన్న నీటి బిందువుల ద్వారా వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాలిలో చేరుతుందని సీడీసీ వివరించింది. వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోకిన వ్యక్తుల నుంచి కాస్త పెద్ద పరిమాణంలో విడుదలయ్యే డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెకన్ల నుంచి నిమిషాల వ్యవధిలోనే నేలపై పడిపోతాయని చెప్పింది. కానీ అత్యంత స్వల్ప పరిమాణంలోని కణాలు మాత్రం కొన్ని నిమిషాల పాటు గాలిలోనే ఉంటాయంది. అవి గాలిలో ఎంత టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటాయనేది ఆ ప్రాంతాల్లోని ఉష్ణోగ్రత, తేమపై ఆధారపడి ఉంటుందని తెలిపింది.

అందుకే తప్పకుండా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించింది. కరోనా సోకిన వ్యక్తి నుంచి ఆరు అడుగుల దూరం వరకు గాలిలో వైరస్‌ ఉనికి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. కాగా, కరోనా వైరస్‌ మహమ్మారి గాలి ద్వారాను వ్యాప్తి చెందుతుందని జాతీయ, అంతర్జాతీయ నివేదికలు ఇదివరకే వెల్లడించాయి. అయితే, గాలిలో వైరస్‌ కణాలు ఎంత దూరం వ్యాప్తి చెందుతాయనే విషయంపై అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం మరోసారి స్పష్టతనిచ్చింది.

తెలంగాణలోని తెల్లరేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

నీ భార్యకు చెప్పు.. నువ్వు యూజ్ లెస్ అని.. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఫైర్!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ ప్రసాద్‌రావు కన్నుమూత

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -