Tuesday, April 30, 2024
- Advertisement -

ఏపిలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు వాయిదా..

- Advertisement -

గత ఏడాది నుంచి కరోనా మహమ్మారి వల్ల విద్యా వ్యవస్థ చిన్నా భిన్నం అవుతుంది. విద్యార్థులు ఇంటికే పరిమితం అవుతున్నారు. ఆన్ లైన్ క్లాసులు అంటున్నా.. అరకొరగా సాగుతుంది. పలు రాష్ట్రాలు పది, ఇంటర్, డిగ్రీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరిపించినా చాలా వరకు వాయిదాల పర్వమే కొనసాగింది. మరికొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షల కొనసాగింపుపై సందిగ్ధం కొనసాగుతూ వచ్చింది. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి.

ఈ మేర‌కు ఏపీ ప్ర‌భుత్వం అధికారికంగా వెల్ల‌డించింది. టెన్త్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై జులైలో స‌మీక్షిస్తామ‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. షెడ్యూల్ ప్ర‌కారం జూన్ 7వ తేదీ నుంచి ప‌ది ప‌రీక్ష‌లు ప్రారంభం కావాలి. ప్రస్తుతం ఏపిలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. దాంతో ఇక్కడ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ సాధ్య‌సాధ్యాల‌పై సీఎం జ‌గ‌న్ ఇవాళ అధికారుల‌తో చ‌ర్చించారు. అనంత‌రం ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అంతకుముందు టెన్త్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై ఏపీ హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది.

ప్రస్తుతం రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ జరుగుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులకు టీకాలు ఇచ్చిన తర్వాతనే పరీక్షలు నిర్వహిస్తే బాగుంటుందని హైకోర్టులో శ్రీకాకుళానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రభుత్వ వైఖరిని తెలియజేయాలని సూచించింది. కరోనా నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఆదేశించిన కోర్టు.. అనంతరం విచారణను జూన్ 18కి వాయిదా వేసింది.

మేఘా నేను సైతం: తమిళనాడు వ్యాప్తంగా 2500 పడకల కోవిడ్ ఆసుపత్రులు

అమెరికాలో కాల్పుల కలకలం

30న కేబినెట్ భేటీ.. లాక్‌డౌన్ పొడిగింపు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -