Tuesday, April 30, 2024
- Advertisement -

ముగిసిన అమరావతి రైతుల పాదయాత్ర

- Advertisement -

అమరావతి రైతుల పాదయాత్ర ముగిసిగింది. 44 రోజుల క్రితం అమరావతిలో న్యాయస్థానం టూ దేవ స్థానం పేరుతో యాత్రను ప్రారంభించిన రైతులు.. ఎండనకా.. వాననకా పలు జిల్లాల్లో పర్యటించారు. రాజధాని కోసం పాదయాత్ర చేపట్టిన రైతులపై పలు చోట్ల పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. వాటన్నింటిని భరించిన రైతులు తమకు రాజధాని మాత్రమే కావాలనే ధృడ సంకల్పంతో ముందుకు సాగారు.

పలువురు పారిశ్రామిక వేత్తలు రైతులకు సంఘీభావం తెలిపారు. మరికొందరు రైతులకు మద్దతుగా నిలిచి వారికి నగదును విరాళంగా అందజేశారు. న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో యాత్ర సాగిస్తున్న రైతులు వేంకటేశ్వర స్వామి, అల్లాహ్, జీసెస్ వాహనాలతో ప్రయాణాలు చేశారు. ఒకానొక సమయంలో వేంకటేశ్వ స్వామి వాహనాన్ని మాత్రమే అనుమతించిన పోలీసులు.. అల్లాహ్, జీసెస్ వాహనాలను నిరాకరించారు. దీంతో రైతులు అక్కడే దీక్ష చేశారు.

ఎట్టకేలకు అమరావతి రైతుల యాత్ర తిరుపతి చేరుకుంది. 44 రోజుల పాటు 450 కిలోమీటర్ల వరకూ యాత్ర చేసిన అన్నధాతలు అలిపిరి వద్ద తమ యాత్రను ముగించారు. వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని తమ భాదను దేవుని వద్ద యల్లబోసుకునేందుకు వారు నడక మార్గాన తిరుపల వెళ్లనున్నారు.

డబ్బులు ఇస్తేనే డోర్లు ఓపెన్‌ చేస్తాం!

తొలి ఒమైక్రాన్‌ మరణం ఎక్కడంటే!

చైతూ విషయంపై మాట్లాడదలుచుకోలేదు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -