Tuesday, April 30, 2024
- Advertisement -

మన దేశం చుట్టూ ఎందుకిలా జరుగుతోంది ?

- Advertisement -

మనదేశం చుట్టూ ఉన్న ఆయా దేశాలు వరుసగా సంక్షోభం కోరల్లో కూరుకుపోతున్నాయి. ఇప్పటికే శ్రీలంక దివాళా దేశంగా కోన ఊపిరితో ఉంటే.. పాకిస్తాన్ లో దాదాపుగా శ్రీలంక పరిస్థితే ఏర్పడేలా కనిపిస్తోంది. ఇప్పుడు మన పొరుగున ఉన్న మరో దేశం కూడా ఆర్థిక సంక్షోభానికి చేరువైంది. ఆ దేశం మరేదో కాదు.. బంగ్లాదేశ్. అవును ప్రస్తుతం బంగ్లాదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభానికి అత్యంత చేరువలో ఉంది. ఈ మద్య కాలంలో బంగ్లాదేశ్ లో కూడా విదేశీ మారకద్రవ్య నిల్వలు అడుగంటుతుండడంతో ఆ దేశ ప్రజలపైన ఆర్థిక భారాన్ని మోపుతోంది అక్కడి ప్రభుత్వం.

ప్రస్తుతం ఆ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను 50 శాతం వరకు పెంచినట్లు అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. గతంలో లీటర్ పెట్రోల్ 44 టాకాలు ( అనగా మన దేశ కరెన్సీలో రూ. 36.98 ) ఉండగా ప్రస్తుతం 130 టాకాలకు చేరింది( మన కరెన్సీలో 109.25 రూపాయలనమాట ). ఇక డీజిల్, కిరోసిన్ వంటి ఇందనలపై కూడా దాదాపుగా 42 శాతం ధరలు పెరుగినట్లు తెలుస్తోంది. ఆ దేశం ఏర్పడినది మొదలుకొని ధరలు ఈ స్థాయిలో పెరగడం ఆ దేశ చరిత్రలోని మొదటిసారి.

అయితే కేవలం డీజిల్ పెట్రోల్ విషయంలో మాత్రమే కాకుండా నిత్యవసర ధరలు కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడి ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నిరసనలు చేపడుతున్నారు. అంతే కాకుండా పెరిగిన ధరలు తగ్గించకపోతే ఆందోళనలు తీవ్ర తరం చేసే అవకాశం కూడా గట్టిగానే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే మన చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా ఇలా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం కాస్త ఆందోళన కలిగించే విషయమే. ఇప్పటికే మన దేశంలో కూడా జే‌ఎస్‌టి పెరుగుదల, నిత్యవసర ధరల పెరుగుదలతో ప్రజలు కాస్త సతమతమౌతున్నారు. ఈ నేపథ్యంలో పొరుగుదేశాల నుంచి మన దేశానికి గట్టి వార్నింగ్ సంకేతాలను పంపుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read

ఇజ్రాయెల్-పాలస్తినా మద్య భీకర యుద్దం !

చైనా భారత్ ను ఎందుకు టార్గెట్ చేస్తోంది ?

సంక్షోభం గుప్పెట్లో.. మరికొన్ని దేశాలు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -