Tuesday, April 30, 2024
- Advertisement -

కే‌సి‌ఆర్ భయపడుతున్నారా.. భయపెడుతున్నారా ?

- Advertisement -

మునుగోడు ఉపఎన్నిక వేళ తెలంగాణలో రాజకీయ వేడి తారస్థాయికి చేరుతోంది. టి‌ఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటిగా అక్కడ భాహిరంగ సభలు నిర్వహిస్తూ గెలుపుకోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇటీవల మునుగోడులో కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాటు చేయగా.. తాజాగా శనివారం సి‌ఎం కే‌సి‌ఆర్ ప్రజా దీవెనసభ పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఇక ఆగష్టు 21 ( ఆదివారం )న బీజేపీ వంతు.. ఇలా మూడు ప్రధాన పార్టీలు మునుగోడు చుట్టూ తిరుగుతున్నాయి. సరే ఈ విషయం అలా ఉంచితే కే‌సి‌ఆర్ మునుగోడు సభలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికరంగా నిలుస్తున్నాయి.

“ఈడీలకు, బోడిలకు తను భయపడనని, అలాంటి వాటికి దొంగలు మాత్రమే భయపడతారని, తను భయపడే వ్యక్తిని కాదని ” కే‌సి‌ఆర్ కేంద్రాన్ని ఉద్దేశించి అన్నారు. అంతే కాకుండా ” ఈ ఈడీలను, బోడి లను పెట్టుకొని ఏం పిక్కుంటావో పీక్కో.. :” అంటూ తనదైన రీతిలో మోడీపై విమర్శలు సంధించారు. చివరకు చేనేత కార్మికుల మీద కూడా జి‌ఎస్‌టి విధించారని, చస్తే స్మశానం మీద కూడా జిఎస్టి, చివరకు పిల్లలు తాగే పాలపై కూడా జిఎస్టి విధించి ప్రజలను దోచుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు సి‌ఎం కే‌సి‌ఆర్.. అయితే కే‌సి‌ఆర్ ఈ బహిరంగ సభలో ఎక్కువ శాతం మోడీ టార్గెట్ గా విమర్శలు చేశారే తప్పా.. మునుగోడులో చేయబోయే అభివృద్ది గురించి చెప్పి చెప్పనట్లుగా ప్రస్తావించారు.

ఎక్కువ శాతం ప్రత్యర్థి పార్టీని తిట్టడానికే సమయం కేటాయిండంతో.. కే‌సి‌ఆర్ భయపడుతున్నారా ? లేక భయపెడుతున్నారా ? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు చాలా మంది. ఇక మునుగోడు ఉపఎన్నికలో టి‌ఆర్‌ఎస్ కు గెలుపు చాలా కీలకం.. ఎందుకంటే ఇప్పటికే దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూసిన టి‌ఆర్‌ఎస్.. మునుగోడు ఉపఎన్నికల్లో కూడా ఓటమిపాలు అయితే ఇక రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టి‌ఆర్‌ఎస్ పై గట్టిగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మునుగోడు విషయంలో కే‌సి‌ఆర్ ఆచితూచి వ్యవహరిస్తూ ఉండడం పోలిటికల్ హిట్ ను మరింత పెంచుతోంది.

Also Read : ఓటర్ల కాళ్ళు మొక్కితే ఓట్లు వేస్తారా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -