Tuesday, May 7, 2024
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ రాహుల్ వల్లే సర్వనాశనం అవుతోందా ?

- Advertisement -

గులాం నబీ ఆజాద్ ఇటీవల కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా పార్టీకి సేవ చేస్తూ వచ్చిన ఆజాద్.. గత కొన్నాళ్లనుంచి ఆయన పార్టీపై అసహనం ప్రదర్శిస్తూ వస్తున్నాడు. దాంతో ఆజాద్ కాంగ్రెస్ ను విడిచే అవకాశం ఉందనే వార్తలు కూడా గత కొద్ది రోజుల నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. ఆ వార్తలకు బలం చేకూరుస్తూ ఆయన ఇటీవల కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాడు.

అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయ వర్గాల్లో కొంత చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ కేంద్రంగా ఆజాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాహుల్ కు రాజకీయాలపై ఏమాత్రం అవగాహన లేదని, ఆయన చూపించే బాధ్యత రాహిత్యం వల్లే కాంగ్రెస్ నాశనమతోందని ఆజాద్ వ్యాఖ్యానించారు. రాహుల్ ను బలమైన నేతగా నిలపాలని తమెంతో ప్రయత్నించిన లాభం లేకపోయిందన్నారు. అసలు రాహుల్ కు పార్టీని సంస్తగతంగా నడిపించాలనే ఆలోచనే లేదని ఆజాద్ కుండబద్దలు కొట్టారు.

అయితే తనకు తొలినాళ్ళ నుంచి ఇందిరా కుటుంబంపై ఉన్న గౌరవం.. ఇప్పటికీ కూడా సోనియా, రాహుల్ గాంధీ పై తనకు ఉందని చెప్పుకొచ్చారు. రాహుల్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత.. ఆయన ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్నప్పుడూ పూర్తిగా పార్టీ విధానాన్ని మార్చి సర్వనాశనం చేశారని ఆరోపించారు. సీనియర్లు, అనుభవజ్ఞులైన నేతలకు ఇప్పుడు పార్టీలో ప్రాధాన్యం లేదని, ప్రస్తుతం అనుభవం లేని భజనపరులకు పార్టీలో అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నారని ఆజాద్ చెప్పుకొచ్చారు.

Also Read

జగన్ దెబ్బతో లోకేష్ కు ఏది దిక్కు ?

మోడీ చెప్పేది ఒకటి.. చేసేది మరోటి!

కే‌సి‌ఆర్ రైతు సంఘాలతో భేటీ వెనుక ఉన్న అసలు వ్యూహం అదే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -