దేవరవేట మొదలైంది.. బండ్ల గణేశ్​ పోస్ట్​ వైరల్..!

- Advertisement -

ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్​ నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్​ చేస్తుంటాడన్న విషయం తెలిసిందే. పవన్​ కల్యాణ్​ వీరాభిమాని అయిన బండ్ల గణేశ్​కు ఆయన పేరుచెబితేనే పూనకం వస్తూ ఉంటుంది. ఇక ఆడియో ఫంక్షన్లు, మూవీ రిలీజ్​ ఫంక్షన్లు, యూట్యూబ్​ ఇంటర్వ్యూలు ఇలా ఎక్కడ చూసినా పవన్​ కల్యాణ్​ భజన చేస్తూ ఉంటాడు. దీంతో ఆయనను పవన్​ కల్యాణ్​ ఫ్యాన్స్​ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. బండ్ల గణేశ్​కు ట్విట్టర్​, ఫేస్​బుక్​, యూట్యూబ్​లో ఆ స్థాయిలో ఫాలోయింగ్​ ఉందంటే అందుకు కారణం పవన్​ ఫ్యాన్సే.

ఇక రాజకీయాల్లోనూ యాక్టివ్​గా ఉండే బండ్ల గణేశ్​ అప్పుడప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీలో చేరిన బండ్ల గణేశ్​.. రచ్చ రచ్చ చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా బండ్ల గణేశ్​ ట్విట్టర్​లో పెట్టిన ఓ పోస్టు సంచలనంగా మారింది. పవన్​ కల్యాణ్​, రానా హీరోలుగా.. అయ్యప్పనుమ్​ కోషియమ్​ అనే మలయాళ చిత్రం తెలుగులో రీమేక్​ అవుతున్న విషయం తెలిసిందే.

ఈ మూవీకి సంబంధించిన ఓ పోస్టర్​ను తాజాగా విడుదల చేశారు. ఈ సినిమాలో పవన్​ కల్యాణ్ బీమ్లా నాయక్​ అనే పోలీస్​ అధికారిగా కనిపించబోతున్నాడు.ఇందుకు సంబంధించిన పిక్​ను ట్విట్టర్​లో షేర్​ చేశాడు బండ్ల గణేశ్​. దేవరవేట మొదలైంది అంటూ పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఈ పిక్​ సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

Also Read

ప్రభాస్​ -నాగ్​ అశ్విన్​ మూవీ షూటింగ్ షురూ.. !

రాజమౌళి – మహేష్ బాబు సినిమా కథ ఇదేనా..!

5 పైసలకే బిర్యానీ.. ఎగబడ్డ జనం

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -