Monday, April 29, 2024
- Advertisement -

మహేష్-బన్నీ….ఆ రేంజ్‌లో విమర్శించుకున్నారు…..ఇష్యూ ఎలా సెటిల్ చేశారంటే…?

- Advertisement -

భరత్ అను నేను, నా పేరు సూర్య……నా ఇళ్ళు ఇండియా…..సినిమా విడుదల తేదీ ఒకటే కావడం తెలుగు సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్న బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్‌ని భయాందోళనలకు గురిచేసింది. సినిమాల కలెక్షన్స్ తగ్గితే ముందు బలయిపోయేది వీళ్ళే మరి. ఆల్రెడీ అజ్ఙాతవాసి, ఇంటెలిజెంట్ లాంటి డిజాస్టర్స్‌తో కుదేలయిపోయి ఉన్న పరిస్థితి. ఇక కొత్త సంవత్సరంలో రిలీజ్ అయిన ఎక్కువ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బకెట్ తన్నేసి ఉండడంతో దిల్ రాజుతో సహా ఇంచుమించుగా అందరు డిస్ట్రిబ్యూటర్స్ కూడా భారీగానే నష్టపోయి ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు సినిమాలు ఒకే రిలీజ్ డేట్‌కి వస్తే కొనడానికి వెనకడుగేశారు బయ్యర్స్. కానీ మహేష్, బన్నీ మాత్రం అస్సలు తగ్గడానికి ఇష్టపడలేదు.

బన్నీ అయితే మహేష్ స్టార్ ఢం కంటే నేనేం తక్కువ అనే వరకూ వెళ్ళాడు. మహేష్ కూడా డేట్ మార్చుకోవడానికి ఇష్టపడలేదు. సినిమా ఇండస్ట్రీ పెద్దలు రాయబారం నడిపినా వర్కవుట్ కాలేదు. అయితే ఈ మొత్తం ఇష్యూని దిల్ రాజు పరిష్కరించాడని తెలుస్తోంది. అల్లు అర్జున్‌తో దిల్ రాజుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే ప్రస్తుతం మహేష్ 25వ సినిమాను దిల్ రాజునే నిర్మిస్తున్నాడు. అందుకే ఎవ్వరూ తగ్గినట్టుగా కాకుండా ఉండేలా దిల్ రాజు రిలీజ్ డేట్స్ ప్లాన్ చేశాడట. ఈ రెండు సినిమాల డిస్ట్రిబ్యూషన్‌లో కూడా దిల్ రాజు భాగస్వామిగా ఉన్నాడు. దిల్ రాజు చాలా తెలివిగా రెండు సినిమాల్లో ఏ ఒక్క సినిమా 26కి వచ్చినా ఎవరో ఒకరు తగ్గినట్టుగా ఉంటుందని …..అందుకే రెండు సినిమాలకు రెండు వారాల గ్యాప్‌లో వేరే రెండు డేట్స్ ఇచ్చాడు దిల్ రాజు. భరత్ అను నేను అనే సినిమాను ఒక వారం ముందుకు జరిపి ఏప్రిల్ 20న రిలీజ్ అయ్యేలా చేశాడు. ఇక నా పేరు సూర్య సినిమాను ఒక వారం పోస్ట్ పోన్ చేయించి మే 4న రిలీజ్ చేయించడానికి ఒప్పించాడు. ఆ రకంగా ఇద్దరు హీరోల్లో ఎవ్వరూ తగ్గినట్టుగా ఉండేలా కాకుండా రాజకీయ తెలివితేటలు వాడి సమస్యను పరిష్కరించాడు దిల్ రాజు. అందుకే సీనియర్స్ రాయబారం తర్వాత ఇంకా ముదిరిన సమస్య దిల్ రాజు చెప్పిన పరిష్కారంతో సమసిపోయింది. అయితే ఈ మొత్తం ఇష్యూలో ఇద్దరు హీరోల ఇగో ఇష్యూస్‌పై మాత్రం సినిమా ఇండస్ట్రీ పెద్దలతో పాటు విశ్లేషకులు కూడా విమర్శలు చేస్తున్నారు.

సినిమా బడ్జెట్స్ స్థాయికి మించి వెళ్తున్న నేపథ్యంలో హీరోలు ఇగో ప్రాబ్లమ్స్ వెళ్ళడం సినిమా పరిశ్రమకు తీవ్ర నష్టం చేస్తుందని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. రిజల్ట్ తేడా వస్తే సినిమాను కొన్నవాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఉంటున్నాయని, ఆ విషయాలు అర్థం చేసుకోకుండా హీరోలు సిల్లీగా ఇగోలకు పోవడం భావ్యం కాదని చెప్తున్నారు. సూపర్ క్రేజ్ ఉన్న హీరో, టాప్ డైరెక్టర్ అన్న పేరున్న పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ల క్రేజీయెస్ట్ సినిమానే రిజల్ట్ తేడా వస్తే కనీస స్థాయి కలెక్షన్స్ కూడా రాబట్టలేదని….అత్యంత ఎక్కువ హార్డ్ కోర్ ఫ్యాన్స్ పవన్ పరిస్థితే అలా ఉంటే ఇక మిగతా హీరోల బాక్స్ ఆఫీస్ స్టామినాపై గొప్పగా మాట్లాడడం వృధా అని వారు చెప్తున్నారు. భారీ రెమ్యూనరేషన్స్ తీసుకునే హీరోలు కాస్త విశాల హృదయంతో ఆలోచించి సినిమా ఇండస్ట్రీకి మంచి చేయాలే కానీ కుంచితత్వంతో ఆలోచించి ఇండస్ట్రీకి నష్టం చేయకూడదని ఇండస్ట్రీ పెద్దలు సుద్దులు చెప్తున్నారు. ఒక్క సినిమా హిట్ అయిన వెంటనే నన్ను మించిన తోపులేడు అనుకోవడం తెలుగు సినిమా హీరోల కామన్ అలవాటు. అలాంటి వాళ్ళ చెవులకు ఇలాంటి మాటలు వినిపిస్తాయంటారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -