Wednesday, May 1, 2024
- Advertisement -

ఎవరు అబద్ధాలు ఆడతారో ఎవరి ప్రవర్తన ఏంటో ప్రేక్షకులు చూశారుగా..!

- Advertisement -

కౌశల్ అబద్ధాలు చెబుతున్నాడు. ఎందుకు అలా చేస్తున్నాడో అర్ధం కావడం లేదు. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. పైగా తనకు ఏ ఒక్క కంటెస్టెంట్ కూడా ఇంతవరకూ ఫోన్ చేసి కనీసం కంగ్రాట్స్ చెప్పలేదని ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియట్లేదని అయోమయంగా ప్రశ్నించింది గీతామాధురి. తన బర్తడేకి ఆహ్వానించడానికి భానుశ్రీ కూడా కాల్ చేసింది. కానీ కౌశల్ రెస్పాండ్ కాలేదని చెప్పుకొచ్చింది. పైగా మేమే ఎందుకు కాల్ చేయాలి ? కౌశలే మాకు ఫోన్ చేయవచ్చు కదా…? అంటూ హౌసులో ఉన్నప్పుడు అయోమయంగా ప్రశ్నించినట్లే మళ్లీ ప్రశ్నిస్తోంది. తోటి హౌస్ మేట్ విజేత అయ్యాడని కనీసం ఏ ఒక్కరూ ఫోన్ చేసి అభినందించలేకపోయారు. మిగతా భాషల్లో ఎవరు విన్నర్ అయినా మిగిలిన కంటెస్టెంట్లు అంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టి మరీ కంగ్రాట్స్ చెబుతారు. నేనయినా సరే అలాగే చేసేవాడిని. కానీ నా తోటి హౌస్ మేట్స్ లో కొందరు నిలబడటం కాదు కదా, కనీసం చప్పట్లు కొట్టలేదు, ఫోన్ చేసి అభినందించలేదని కౌశల్ ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపైనే గీతా మాధురి స్పందించిన తీరు ఆమెను విమర్శల పాల్జేస్తోంది. కౌశల్ అబద్ధాలు చెబుతున్నాడని గీతా చెప్పడంపై కౌశల్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 113 రోజులు బిగ్ బాస్ హౌసులో ఎవరు అబద్దాలు చెప్పారో ? ఎవరు రాత్రి అయితే గుసగుసలతో చెవులు కొరుక్కున్నారో ? ఎవరి ప్రవర్తన ఏంటో చూశారుగా ? మళ్లీ నువ్వు కొత్తగా కౌశల్ అబద్ధాలు ఎందుకు ఆడుతున్నాడో తెలియదు అంటూ చెప్పడం ఏంటని ట్రోల్స్ చేస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్ 2 రియాలటీ షో ద్వారా కంటెస్టెంట్లు ఎవరేంటో ? కోట్లమంది ప్రేక్షకులకు తెలిసిపోయింది. అది రియాలటీ షో అన్నది పలువురు కంటెస్టెంట్లు మరిచిపోయి ప్రవర్తించారు. తాము నవ్వినా, ఏడ్చినా, ఏడిపించినా, ఆడినా, పాడినా, దమ్ము కొట్టినా, డాన్స్ చేసినా…ఏం చేసినా బిగ్ బాస్ నిర్వాహకులు వాటిని ఎడిట్ చేసి మరీ ప్రేక్షకులకు చూపించారు. అంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ల మనస్తత్వాలు, ప్రవర్తన, నిజాలు చెబుతున్నారా ? అబద్ధాలు ఆడుతున్నారా ? తోటి వారితో ఎలా నడుచుకుంటున్నారు. వారి మాటలు, కొట్లాటలు, టాస్కుల్లో ఆడే విధానం, కంటెస్టెంట్ల యాటిట్యూడ్, వ్యక్తిత్వం, అన్నీ గమనించారు. దీంతో 100 రోజులుకు పైగా ఉన్న కంటెస్టెంట్ల వ్యక్తిత్వాలు ఏంటో ? ఎంత పద్ధతిగా, నిజాయతీగా, గౌరవప్రదంగా ఆడుతున్నారో ప్రతి ఒక్క ప్రేక్షకుడికి తెలిసిపోయింది. ఒక్క రోజు, ఒక్క పూట అయితే ఒరిజినాలిటీలు పక్కన పెట్టి ముఖంతో పాటు మనసుకి, ఆలోచనలకీ మేకప్ వేసేసుకుని నటించేవారేమో ? కానీ 113 రోజులు డే అండ్ నైట్ ఉండేసరికి ప్యాంపరింగులు, ముద్దులు, ముచ్చట్లు, హగ్గులు, చాడీలు, కుట్రలు, కుతంత్రాలు, కన్నింగ్ గేమ్ ప్లాన్స్, గ్రూపులు కట్టి చీటింగ్ చేయడాలు..అబ్బో అన్నీ బయటపడ్డాయి.

ఎవరు అబద్ధాలు ఆడారో ? ఎవరు నిజాయతీగా ప్రవర్తించారో ? తమను కోట్ల కళ్లు గమనిస్తున్నాయని ఎవరు హద్దులు దాటకుండా గేమ్ మాత్రమే ఆడారో ? ఎవరైతే ఏంటి ? అభిమానులు ఈ రోజు ఉంటారు. రేపు పోతారు. ప్రేక్షకులు వంద రకాల ఫీడ్ బ్యాక్ ఇస్తారు వాటిని పట్టించుకోనవరం లేదని నాడు చెప్పారు. అప్పుడు ప్రేక్షకుల ఓట్లు అడిగి, వారిచ్చే ఫీడ్ బ్యాక్ అవసరం లేదని తిరస్కరించి, మళ్లీ ఇప్పుడు నేను అతడితో అలా ఉంటే తప్పేంటి ? ఇతడితో ఇలా ఉంటే నష్టమేంటి ? ఆయన అబద్దాలు చెబుతున్నాడు. అంటూ మళ్లీ మళ్లీ పదే పదే ఎందుకు సంజాయషీ ఇచ్చుకోవడం ? నిన్ను ఇప్పుడు సమాధానం చెప్పమని అసలు ఎవరు అడిగారు ? నీకు నచ్చినట్టు నువ్వు గేమ్ ఆడావు. ప్రేక్షకులకు నచ్చినవారికి వాళ్లు ఓట్లు వేశారు. గేమ్ ముగిసిపోయింది. నాడు ప్రేక్షకులను వారి అభిప్రాయాలను పట్టించుకోనవసరం లేదని తోటి హౌస్ మేట్స్ కి చెప్పి, నేడు నేను అలా.. నేను ఇలా… అలా ఉంటే తప్పేంటి ? ఇలా ఉంటే తప్పేంటి ? అంటూ ఎందుకు సంజాయషీ చెప్పుకోవడం. వదిలెయ్. ఏమో అది ప్రేక్షకులు, కౌశల్ ఆడుతున్న గేమ్ ఏమో ? నువ్వే కరెక్టేమో ? నేను ఏం చెబుతున్నానో అర్ధమవుతోందా ..! ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -