క్షమించండి..! ఫ్యాన్స్​కు వెంకీ విజ్ఞప్తి.. రీజన్​ ఏమిటంటే?

- Advertisement -

అగ్రనటుడు విక్టరీ వెంకటేశ్​ తన అభిమానులకు సారీ చెప్పాడు. తనను మన్నించండి.. అంటూ కోరాడు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ప్రస్తుతం థియేటర్లలో సినిమాలు విడుదలయ్యే పరిస్థితి లేదు. దీంతో చిన్న సినిమాలన్నీ ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు. అయితే పెద్ద సినిమాలు మాత్రం బడ్జెట్ దృష్ట్యా ఓటీటీలో విడుదల చేయడం లేదు. మళ్లీ సాధారణ పరిస్థితుల కోసం ఎదురుచూస్తున్నారు. తమిళంలో సూపర్​ హిట్​ అయిన అసురన్​ చిత్రాన్ని తెలుగులో రీమేక్​ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాను సురేశ్​ ప్రొడక్షన్స్​ నిర్మిస్తుండగా.. శ్రీకాంత్​ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్​ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను అమెజాన్​ ప్రైమ్​లో విడుదల చేయాలని మేకర్స్​ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 20న అమెజాన్​ ప్రైమ్​లో ఈ మూవీ స్ట్రీమింగ్​ కానున్నది. ఈ నిర్ణయంపై వెంకటేశ్ ఫ్యాన్స్​ తీవ్రంగా మండిపడుతున్నారట. తమ అభిమాన నటుడి సినిమాను కేరింతలు, హడావుడి నడుమ థియేటర్​లో చూడాలని భావిస్తుంటే.. తమ ను నీరుగార్చేలా.. ఓటీటీలో విడుదల చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారట.

Also Read: ఈ భామ జోరు చూస్తే ..పూజా హెగ్డే, రష్మికకు ఎసరు పెట్టేలా ఉందే..!

ఈ విషయం సోషల్ మీడియాలో వెంకటేశ్​ దృష్టికి వచ్చింది. దీంతో ఓ యూట్యూబ్ చానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన ఫ్యాన్స్​ను క్షమాపణలు కోరారు. ‘ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్​ పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో థియేటర్లలో సినిమాలు విడుదల చేయడం సాధ్యం కాదు. అందుకే తాము ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నాము. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే నన్ను క్షమించండి’ అంటూ వెంకటేశ్​ పేర్కొన్నాడు.

Also Read: బాహుబలిని వెనకేసిన రాకీ బాయ్..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -