Wednesday, May 1, 2024
- Advertisement -

నంది అవార్డు విమ‌ర్శ‌లపై జీవిత స్పంద‌న‌

- Advertisement -
  • ఎవ‌రి ప్ర‌మేయం లేద‌ని స్ప‌ష్టం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నంది అవార్డులపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై 2015 జ్యూరీ చైర్మ‌న్‌గా వ్య‌హ‌రించిన జీవిత స్పందించారు. సినీ ప్ర‌ముఖులు చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అన‌వ‌స‌రంగా ప‌రువు తీస్తున్నార‌ని మండిప‌డ్డారు.

రోజుకొక‌రు నంది అవార్డుల‌పై విమ‌ర్శులు కుప్పిస్తున్నారు. ఒక‌రేమో క‌మ్మ‌కు ప‌ట్టం క‌ట్టార‌ని, మ‌రొక‌రేమో సైకిల్ అవార్డులు అని, ఇంకొంద‌రు టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కే ఇచ్చార‌ని, ప్ర‌తిభకు ఇవ్వ‌డం లేద‌ని, బంధువ‌ర్గానికే ఇస్తార‌ని, టీడీపీని చూసి న‌ట‌న నేర్చుకోవాల‌ని త‌దిత‌ర ఘాటు విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న జీవిత స్పందించారు. ఎంపిక విధానం గురించి ఏ మాత్రం తెలుసుకోకుండా ఎవరికీ వారు ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయడం సరికాదని తెలిపారు. అంతే కాకుండా ఈ అవార్డులలో ఎటువంటి మోసాలు గాని, రాజకీయ నాయకుల ప్రమేయం గాని లేదని చెప్పారు.

ప్ర‌జ‌లు ప‌ట్టించుకోని ఈ విషయాన్ని అనవసరంగా సినీ పరిశ్రమకు చెందినవారే ప‌రిశ్ర‌మ పరువు తీస్తున్నారు. ఆ విషయం తనను చాలా బాధించిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రుద్రమదేవికి అవార్డు రాకపోవడంపై కూడా ఆమె స్పందించారు. ఈ కేటగిరీలో అన్ని కోణాల్లో పరిశీలించాం. ఆ తర్వాతే ఉత్తమ చిత్రాన్నే ఎంపిక చేశాం. అన్నీ ప‌రిశీలించిన త‌ర్వాతే అల్లు అర్జున్ చేసిన పాత్రకు మాత్రం ఎస్వీ రంగారావు పేరుతో ఉన్న అవార్డుని ఇచ్చామని తెలిపారు. అల్లు అర్జున్- చిరంజీవి లాంటివారే ఈ విషయాలపై స్పందించ‌డం లేదు. బయటవాళ్లు మాత్రం అనవసరంగా స్పందిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

https://www.youtube.com/watch?v=gxawzb9Kwts

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -