లూసిఫర్ రీమేక్ కి అంతా సిద్ధం.. షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే..!

- Advertisement -

మలయాళంలో అగ్ర హీరో మోహన్ లాల్ హీరోగా నటించిన లూసిఫర్ సినిమా అక్కడ సంచలన విజయం సాధించింది. తెలుగులో కూడా ఈ సినిమా అదే పేరుతో విడుదలై ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా కథ మెగాస్టార్ చిరంజీవికి నచ్చడంతో కథలో మార్పులు చేర్పులు చేసి తెలుగులో చేసేందుకు నిర్ణయించుకున్నారు. మొదట ఈ సినిమా కథను మార్చే బాధ్యతను సాహో దర్శకుడు సుజిత్ కు ఇవ్వగా.. ఆయన చేసిన మార్పులు చిరంజీవికి అంతగా నచ్చలేదు. ఆ తర్వాత ఈ సినిమా వినాయక్ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. ఫైనల్ గా ఈ సినిమా రీమేక్ బాధ్యతలు తమిళ దర్శకుడు మోహన్ రాజాకు అప్పగించారు.

లూసిఫర్ సినిమాను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మోహన్ రాజా చేసిన మార్పులు నచ్చడంతో చిరంజీవి ఈ సినిమాను పట్టా లెక్కించేందుకు అంగీకారం తెలిపారు. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఇందులో మరో ముఖ్య పాత్రల్లో చరణ్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తికావడంతో లూసిఫర్ సినిమా ను అతి త్వరలో మొదలు పెట్టనున్నారు. ఇందుకు సంబంధించి డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఆగస్టు 12 నుంచి న లూసిఫర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

- Advertisement -

లూసిఫర్ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఉండదు. అయితే తెలుగులో కథ మార్చి హీరోయిన్ పాత్రను పెట్టారు. ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార ను ఎంపిక చేసినట్లు సమాచారం. లూసిఫర్ లో హీరో చెల్లెలిగా మంజు వారియర్ నటించింది. ఈమెది కథలో కీలకమైన పాత్ర. తెలుగులో ఆ పాత్రను సీనియర్ నటి సుహాసిని చేస్తోంది. ఆగస్టు 12 నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుండడంతో ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ సెల్వ రాజన్ నేతృత్వంలో ఓ భారీ సెట్ ని నిర్మించే పనులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే సరికి ఈసెట్ నిర్మాణం కూడా పూర్తి చేయనున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిజం ఎలివేషన్స్ సీన్స్ హైలెట్ అయ్యేలా మోహన్ రాజా స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు సమాచారం.

Also Read

బన్నీ కోసం వచ్చేస్తున్న సన్నీ..!

దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్..!

ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -