Friday, March 29, 2024
- Advertisement -

నిరుద్యోగులకు ఈ-రిక్షాలు పంపిణీ చేసిన కలియుగ కర్ణుడు సోనూసూద్!

- Advertisement -

దేశంలో కరోనా మహమ్మారితో ఎంతో మంది బాధపడ్డారు. లాక్ డౌన్ సమయంలో కోట్ల మంది పేదలు అష్టకష్టాలు పడ్డారు. అలాంటి సమయంలో నేనున్నా అంటూ ఎంతో మంది బాధితులకు తన వంతు సహాయం చేసి వారి ఆశలు నెరవేర్చాడు…కన్నీరు తూడ్చారు. లాక్‏డౌన్ సమయంలో వలస కార్మికులకు సహయం చేసి కలియు కర్ణుడిగా పేరు తెచ్చుకున్నాడు బాలీవుడ్ నటుడు సోనూసూద్. సినిమాల్లో విలన్‌గా ఎంతగానో పేరు తెచ్చుకున్న నటుడు సోనూసూద్‌.. లాక్‌డౌన్‌లో హీరోగా మారిపోయారు. వలస కూలీలకు సాయం చేస్తూ అందరి ప్రశంసలు పొందారు.

ఎంతగా అంటే ఇప్పుడు దేవుడి పటాల పక్కన సోనూసూద్ ఫోటో పెట్టి మరీ పూజిస్తున్నారు. ఆయన విగ్రహాల ఏర్పాటు చేస్తున్నారు. ‏ తాజాగా సోనూ సూద్ మరోమారు దొడ్డ మనసు చాటుకున్నాడు. తన స్వస్థలమైన పంజాబ్‌లోని మోగా పట్టణంలో ఎనిమిది మంది నిరుద్యోగులకు ఎలక్ట్రిక్ రిక్షాలు (ఈ-రిక్షా) అందించాడు.  ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 150 ఈ-రిక్షాలు పంచాలని నిర్ణయించుకున్నానని, ఫలితంగా కొంతమందికైనా ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నాడు.

ప్రతి ఒక్కరూ అవసరమైన వారికి తోచినంత సాయం చేయండి. నేను నా తల్లిదండ్రుల నుంచి ఈ సేవా గుణాన్ని అలవర్చుకున్నానని ప్రకటించారు. నేను దేవుణ్ని కాదని అందరిలాగే అవసరమైన వారికి సాయం చేస్తూ నా బాధ్యత నిర్వర్తిస్తున్నానని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఆయన సోదరి మాళవిక సచార్, బావ గౌతమ్‌ సచార్‌ కూడా పాల్గొన్నారు.

ఐపీఎల్ వేలం తుదిజాబితాలో సచిన్ తనయుడికి చోటు!

అరకులో ఘోర రోడ్డు ప్రమాదం…!

పెళ్లి పీట‌లు ఎక్కబోతున్న‌ మ‌హాన‌టి !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -