Thursday, May 2, 2024
- Advertisement -

అంతర్జాతీయ గుర్తింపును సంపాదించిన సూర్య “ఆకాశమే నీ హద్దురా”!

- Advertisement -

తమిళ్ స్టార్ హీరో, విలక్షణ నటుడు సూర్య హీరోగా నటించిన తమిళ్ మూవీ‘సూరరై పోట్రు’ గత సంవత్సరం అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలై అద్భుత ప్రజాదరణ సొంతం చేసుకుంది. ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లోనూ సక్సెస్ సాధించడం విశేషం. ఎయిర్‌ డెక్కన్‌ అధినేత కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవిత చరిత్ర ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. ఈ మూవీని తెలుగులో “ఆకాశం నీ హద్దురా” టైటిల్ తో రిలీజ్ చేయగా అన్ని వర్గాల ప్రజలు సినిమాకు బ్రహ్మరథం.
కరోనా సమయంలో ఓటీటీ ద్వారా విడుదలైన పెద్ద తమిళ సినిమాగా రికార్డు సృష్టించింది.

అలాగే “సూరరై పోట్రు”మూవీ ఈ సంవత్సరం ఉత్తమ నటుడు, నటి, దర్శకుడు, బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగాలలో ఈ సినిమా ఆస్కార్ కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. కానీ దురదృష్టవశాత్తు ఎంపిక కాలేదు. మరోవైపు అంతర్జాతీయ సినిమా రివ్యూ సంస్థ ‘ఐఎండీబీ’లో అత్యధిక రేటింగ్ వచ్చిన మూడో సినిమాగా ఈ సినిమా ఘనత సాధించింది.

Also read:బాలకృష్ణ తన కెరియర్లో వదులుకున్న సినిమాలివే?

తాజాగా షాంఘైలో నగరంలో జరిగిన అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్‌కు ఎంపికైన ఏకైక సౌత్ ఇండియా సినిమాగా “సూరరై పోట్రు” నిలవడంతో తెలుగు,తమిళ్ ఇండస్ట్రీలోని సూర్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.‘ప్రైజ్‌ ది బ్రేవ్’ పేరుతో ఈ సినిమా షాంఘై ఫిలిమ్ ఫెస్టివల్‌లో పానరోమా విభాగంలో ప్రదర్శితమవుతుందని రాజశేఖర్ పాండియన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఈ ఫిలిమ్ ఫెస్టివల్ జూన్ 11న ప్రారంభమై 20వ తేదీన ముగుస్తుంది. ప్రస్తుతం సూర్య కెరియర్ లో 40 వ సినిమా స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు.

Also read:పిల్లల్ని హత్తుకొని ఎమోషనల్ అయిన అల్లు అర్జున్..ఎందుకంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -